Home తాజా వార్తలు కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్ సైడే..!

కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్ సైడే..!

Errabelli press meet on WGL municipal polls

 

వరంగల్ అర్బన్ : వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అనే మాదిరిగా టీఆర్‌ఎస్ పక్షానే ఉంటుందని, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా వరంగల్ ప్రజలు మంచి తీర్పు ఇస్తారనే నమ్మకం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. హన్మకొండ రాంనగర్‌లోని షైన్ స్కూల్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధిలో ముందుందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో అనూహ్యమైన అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పటికే చాలా అభివృద్ధి చేసామని, ఇంకా చేస్తామన్నారు.

ఇంకా మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని, ఇప్పటి వరకు ప్రతీ ఎన్నికలలో మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. వరంగల్ రూపురేఖలు మార్చేందుకు మేము మా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిరంతరం కష్టపడుతున్నట్లు వివరించారు. కేంద్రం మెడడు వంచైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెస్తామన్నారు. గిరిజన యూనివర్శిటీకి 600 ఎకరాలు ల్యాండ్ ఇస్తే కేంద్రం ఇవ్వలేదంటోందని మండిపడ్డారు. గడిచిన ఆరేండ్లలో 1 లక్షా 53 వేల కోట్లు రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో ఇస్తే కేవలం 1 లక్షా 40 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని మా వాటా కూడా సరిగా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేసే ముందు వాళ్ల హామీలు ఏంటో చెప్పాలన్నారు.

బీజేపీ వాళ్లు చాలా సందర్భాల్లో ఇస్తున్నాం.. ఇస్తున్నాం అంటున్నారు. వారు ఇచ్చిందేమిటో చెప్పాలన్నారు. రాజ్యాంగం ప్రకారం మా నిధులు మాకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడాలని, 70 ఏళ్లలో ఈ దేశం అభివృద్ధికి వాళ్లు చేసేందేమీ లేదని విమర్శించారు. కడియం శ్రీహరి, తాను ఎంపీగా ఉన్నప్పుడు కోట్ల రూపాయాలతో అభివృద్ధి చేసామన్నారు. వరంగల్‌కు వచ్చిన వారసత్వాన్ని అప్పుడు వైఎస్ తిరుపతికి పట్టుకెళ్లాడని, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ మా హక్కు.. మీరు ఇచ్చేదేం కాదన్నారు.

అన్ని కోచ్‌ఫ్యాక్టరీలు ఉత్తర భారతదేశంలోనే ఎందుకు ఉండాలని, దక్షిణ భారతంలో ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. కోచ్‌ఫ్యాక్టరీ తెలంగాణకు ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు పరితపిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మొన్నటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు పిచ్చిపిచ్చి మాటలతో ప్రజలను గందరగోళ పరచలేరన్నారు. వరంగల్ ప్రజలకు మంచి చెడూ తెలుసని, వారికి తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

Errabelli press meet on WGL municipal polls