Home జనగామ గూడూరు చెరువులో చేప పిల్లలను వదిలిన ఎర్రబెల్లి

గూడూరు చెరువులో చేప పిల్లలను వదిలిన ఎర్రబెల్లి

జనగాం: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని చెరువులో ఉచిత చేప పిల్లలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ ఉన్న పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. మత్స్యకారుల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే చేప పిల్లలను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ముదిరాజ్ సభ్యులతో కలిసి ఎర్రబెల్లి చేప పిల్లలను చెరువులో వదిలారు.