Home తాజా వార్తలు హరితహారంను విజయవంతం చేయాలి : ఎర్రబెల్లి

హరితహారంను విజయవంతం చేయాలి : ఎర్రబెల్లి

 Errabelli Review meeting on Haritha Haram with Officersవరంగల్ : ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి వందశాతం  సంరక్షించాలని ఆయన తెలిపారు. హరితహారం, ఉపాధి హామీ పథకం అమలు, కల్లాల నిర్మాణం తదితర అంశాలపై బుధవారం ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఐదు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.  ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపిలు, ఎంఎల్ఎలు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.