Home తాజా వార్తలు మూడేళ్లలో వరంగల్ జిల్లాకు నీళ్లు అందిస్తాం: మంత్రి ఎర్రబెల్లి

మూడేళ్లలో వరంగల్ జిల్లాకు నీళ్లు అందిస్తాం: మంత్రి ఎర్రబెల్లి

Errabelli

 

వరంగల్ అర్జన్: కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి వరంగల్ జిల్లాకు నీళ్లు అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులకు సిఎం కెసిఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారని, ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు నిర్మిసతున్నామన్నారు. కేంద్ర సిసిఐ ద్వారా కేవలం 600 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. దీనిని బిజెపి నాయకులు ఎక్కడా మాట్లాడడం లేదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సొంత అవసరాలకు ఉపయోగించరాదని ఎర్రబెల్లి తెలిపారు. గ్రామ స్వరాజ్యం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, అందరూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎంపి బండ ప్రకాష్ పేర్కొన్నారు.

Errabelli review meeting on kaleshwaram project