Home తాజా వార్తలు వరంగల్ అభివృద్ధిపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి సమీక్ష

వరంగల్ అభివృద్ధిపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి సమీక్ష

Errabelli, Satyavati review on Warangal development

 

వరంగల్ అర్భన్: నగర అభివృద్ధిపై మంత్రులు ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల నగరంలో చాలా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సిఎం కెసిఆర్ చెప్పిన విధంగా వరంగల్ నగర అభివృద్దికి అధికారులు అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలి కోరారు. వరంగల్ లో జూన్ 15 లేదా 16వ తేదీన మంత్రి కెటిఆర్ పర్యటన ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… వరంగల్ నగరంలో ప్రజలకు అన్ని సౌకర్యాలను అందిస్తామని, మిషన్ భగీరథతో రోడ్డు దెబ్బతిన్నాయి… వాటికి మరమ్మతులు చేస్తాం అని, మంత్రి కెటిఆర్ పర్యటనలో ప్రారంభోత్సవాలతో పాటు వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష ఉంటుందని మంత్రి సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినమ్ భాస్కర్, ఎంపి బండా ప్రకాశ్, ఎంఎల్ సి కడియం శ్రీహరి, ఎంఎల్ఎలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Errabelli, Satyavati review on Warangal development