Home తాజా వార్తలు మల్లన్నసాగర్‌కు భూములిస్తాం : ఎర్రవల్లి గ్రామస్థులు

మల్లన్నసాగర్‌కు భూములిస్తాం : ఎర్రవల్లి గ్రామస్థులు

Harish-Rao-Mallanna-Sagarమెదక్ : ఎర్రవల్లి గ్రామస్థులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బుధవారం పల్లెపహాడ్ గ్రామ ప్రజలు, గురువారం ఎర్రవల్లి గ్రామస్థులు మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. భూములు ఇస్తామంటూ గ్రామస్థులు, రైతులు లిఖితపూర్వక పత్రాన్ని మంత్రి హరీశ్‌రావుకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు గ్రామాల ప్రజలకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌కు భూములు ఇచ్చిన రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. బంగారు తెలంగాణకు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్‌కు అండగా ఉంటామని ఎర్రవల్లి గ్రామ ప్రజలు స్పష్టం చేశారు.