Tuesday, March 21, 2023

కమీషన్ల కోసమే ఎస్సారెస్పి ఆధునీకరణ

- Advertisement -

trees

* సిపిఎం బృందం

మన తెలంగాణ/సంగెం : కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్సా రెస్పి కాలువలకు పీడర్ చానల్స్ నిర్మించకుండా ఉన్న కాలువల ఆధునీకరణ పేరుతో కాంట్రాక్టర్లు స్వలాభం కోసం రూ.కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు న్నారని సిపిఎం జిల్లా నాయకుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దాపురం రమేష్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని పల్లార్‌గూడ డిబిఎం-40 కాలు వ సాగునీటి పరిస్థితిని సిపిఎం ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దాపురం రమేష్ మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ఉపకాలువలు నిర్మించి 3 దశాబ్ధాలు దాటిన ఇంత వరకు ఒక్క ఎకరానికి ప్రత్యక్షంగా సాగు నీరు అందించ లేదన్నారు. అప్పుడప్పుడు వచ్చే నీటితో రైతులే స్వయంగా కొన్ని చెరువులు నింపుకుంటున్నారంటే తప్పు అధికారులదా..? ప్రభుత్వానిదా.. ? అని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం కాలువల మేయింటెన్స్ పేరుతో రూ.వందల కోట్లు, ఇతర కాలువలకు సుమారు రూ.200 కోట్లు కేటాయించారని అన్నారు. డిబిఎం 40 కాలువ ద్వారా రైతులు రూ.210 కోట్లు లబ్ధి పొందినట్లు మంత్రి హరీష్‌రావు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. పిల్ల కాలువలు లేకుండా రైతులకు సాగునీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీరాంసాగర్ కాలువలకు పీడర్ చానెల్స్ నిర్మించి ప్రత్యక్షంగా రైతులకు, పంటలకు సాగునీరు అందించాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన కాంట్రాక్టు పనులపై విచారణ చేపట్టాలన్నారు. లేనిపక్షంలో రాజకీయాలకు అతీతంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నమిండ్ల స్వామి, మండల కార్యదర్శి పొడేటి బాబు, నాయకులు ఇంద్రసేన, రామన్న, బీమాతో పాటు, సిపిఎం నాయకులు  పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News