Thursday, April 25, 2024

రాళ్లూ రప్పల మధ్య ఎంఎల్‌ఎ సీతక్క

- Advertisement -
- Advertisement -

MLA Seethakka

 

వాగులు, వంకలు దాటుకుంటూ.. గిరిజన గ్రామల్లో తలపై నిత్యావసరాల మూట మోసిన ములుగు ఎంఎల్‌ఎ

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ములుగు ఎంఎల్‌ఎ సీతక్క అన్నా రు. ములుగు నియోజక వర్గంలోని వాజేడు మం డలం గుమ్మడి దొడ్డి నుంచి వాగులు వంకలు దాటుతూ సుమారు 15కిలో మీటర్లు బైక్‌పై, కా లినడకన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మ హ్మద్‌తో కలిసి పెనుగోలు గ్రామానికి చేరుకుని పేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపి ణీ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ… లాక్‌డౌన్ సందర్భంగా ఇళ్లలోనే ఉండాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు.

కన్నాయిగూడెం మండలంలో నిత్యావసర సరుకుల పంపిణీ
మండల పరిధిలోని రాంపూర్ గ్రామం గుత్తికోయ గూడెంలో లంబాడీ ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ సీత క్క పేద వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి 5కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పస్తు లు ఉందవద్దనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, మండల అధ్యక్షుడు అప్సర్, ఎంపిపి జనగాం సమ్మక్క, ములుగు మండల అధ్యక్షుడు చాంద్ పాషా, వైస్ ఎంపిపి బొల్లె భాస్కర్, నాగారం సర్పంచి ఈసం రామ్మూర్తి, ఇర్స వడ్ల వెంకన్న, ఎంపిటిసి చిట్యాల శైలజ అరుణ్ కుమార్, మావురపు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Essential goods distributed by MLA Seethakka
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News