Home తాజా వార్తలు ప్రవేట్ స్కూళ్ల ఏర్పాటు గడువు 31

ప్రవేట్ స్కూళ్ల ఏర్పాటు గడువు 31

Private-Public-School

హైదరాబాద్‌ః రాష్ట్రంలో నూతనంగా ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటు చేసుకోవడానికి డిసెంబర్ 31 తో గడువు ముగుస్తుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జి. కిషణ్ తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను అంగీకరించడంలేదని వెల్లడించారు. దీనికి సంబంధించిన సవరణ జివొను ఆయన శనివారం విడుదల చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు, ప్రాంతీయ విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాస్తవానికి అక్టోబర్‌తోనే పాఠశాలలు స్థాపించడానకి గడువు ముగిసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రూ.20వేల ఆలస్య రుసుంతో ఈ నెల చివర వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని కిషణ్ వివరించారు. ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా వంద వరకు దరఖాస్తులు వచ్చాయని ఆ శాఖ అధికారులు పెర్కొన్నారు.