Home తాజా వార్తలు రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు

రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు

 Tribal Advisory Council

 

చైర్మన్‌గా రాష్ట్ర సంక్షేమ వ్యవహారాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
20మంది సభ్యులు-మూడేళ్ల కాలపరిమితి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర శాసన సభ, పార్లమెంట్ సభ్యుల ఎన్నికల అనంతరం నూతనంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశారు. ఈ సలహా మండలి చైర్మన్‌గా రాష్ట్ర సంక్షేమ వ్యవహరాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తుండగా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు మండలి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అధికారిక సభ్యులుగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, మరో సభ్యుడిగా రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధనా, శిక్షణా సంస్థ సంచాలకులు ఉంటారు.

అనధికారిక సభ్యులుగా 15మందిని ప్రభుత్వం నియమించింది. ఇందులో పార్లమెంట్ సభ్యుల కొటాలో మలోత్తు కవిత, సోంబాబురావు, శాసన సభ్యుల కొటాలో సత్యవతి రాథోడ్,అత్రం సక్కు, బాపురావు రాథోడ్,అజ్మీరా రేఖా,ఎం. రవీంద్ర కుమార్,ధర్మాసంత్‌రెడ్డి నాయక్,బొంతు శంకర్ నాయక్, అనసూయధనసరి, రేగాకాంతారావు, బొంతు హరిప్రియ,మచ్చ నాగేశ్వర్ రావు,వీరారాఘ్, ఎల్.రాములు మండలి కోటాలో సత్యవతి రాథొడ్‌లు ఉన్నారు. ఈ మండలి నియామకం 8ఆగస్టు2019నుంచే అమలులోకి వచ్చింది.ఈ గిరిజన సలహా మండలి మూడేళ్ల కాలపరిమితి మెర ఉనికిలో ఉంటుందని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.

Establishment of State Tribal Advisory Council