Home అంతర్జాతీయ వార్తలు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి

ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి

Abiy Ahmed

 

ఓస్లో: ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌ను 2019 నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరిట్రియాలో శాంతిస్థాపనకు చేసిన కృషికిగాను అబీ అహ్మద్ నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. 1998 నుంచి 2000 సంవత్సరం వరకు ఇథియోపియా, ఇరిట్రియా మధ్య యుద్ధం జరిగింది. సంవత్సరాల తరబడి శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య 2018 జులైలో సత్సంబంధాలు తిరిగి ఏర్పడ్డాయి. 90 లక్షల స్వీడిష్ క్రౌన్లు లేదా 9 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన ఈ బహుమతిని డిసెంబర్ 10న స్వీడిష్ పారిశ్రామికవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి నాడు ఓస్లోలో ప్రదానం చేస్తారు.

 

Ethiopian PM Abiy Ahmed won Nobel Peace Prize, Ethiopis and Eritria longtime foes who fought a border war from 1998 to 2000 restored relations in July 2018