Tuesday, September 17, 2024

యువకుడి మర్మాంగాలను కట్ చేసిన నపుంసకులు

- Advertisement -
- Advertisement -

 

ఆగ్రా: ఇద్దరు నపుంసకులు ఓ యువకుడి మర్మాంగాలు కట్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ఇద్దరు నపుంసకులపై బాధితుడు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుడ్డి, రాజు అనే నపుంసకులు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేసిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేసేందుకు ఓ యువకుడు నపుంసకులతో కలిసి వెళ్లాడు. రెండు రోజుల తరువాత తీవ్ర గాయాలతో ఇంటికి రావడంతో అతడి సోదరి ఆ యువకుడిని ప్రశ్నించింది. తన మర్మాంగాలను ఇద్దరు నపుంసకులు కట్ చేశారని తెలిపారు. వెంటనే ఆమె ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐపిసి 326 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌ఒ అశిష్ కుమార్ సింగ్ తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News