Home అంతర్జాతీయ వార్తలు యూరపులో మళ్లీ కరోనా కల్లోలం

యూరపులో మళ్లీ కరోనా కల్లోలం

Europe is fighting a 2nd wave of corona pandemic

 

మరోసారి లాక్‌డౌన్‌కు బ్రిటన్ సన్నద్ధం

న్యూఢిల్లీ: యూరప్‌లో కొవిడ్-19 మహమ్మారి విజృంభణ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. యూరప్‌లో కరోనా వైరస్ తీవ్రత చాలా ఆందోళనకరంగా ఉందని డబ్లుహెచ్‌ఓ ప్రకటించడంతో మరోసారి స్వల్పకాలిక లాక్‌డౌన్ విధింపునకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధపడుతోంది. వచ్చేవారం ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండు వారాలలో యూరపు దేశాలలో కరోనా కేసుల సంఖ్య 10 శాతానికి పైగా పెరిగాయి. యూరపు దేశాలలో రానున్న రోజులలో పరిస్థితి చాలా తీవ్రస్థాయిలో ఉండవచ్చని డబ్లుహెచ్‌ఓ యూరపు ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ క్లూజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మార్చి నెలలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటి పరిస్థితులతో పోలిస్తే మళ్లీ గత కొద్ది వారాలుగా కేసుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఇది అప్రమత్తం కావాల్సిన సమయమని ఆయన హెచ్చరించారు. బుధవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో 9,874 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో ఇంత పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. పాఠశాలల పునఃప్రారంభంతోసహా అనేక వ్యాపార, కార్యాలయ కార్యకలాపాలు పునరుద్ధరణ జరిగిన దరిమిలా రెండవ విడత కరోనా ప్రభంజనం మొదలైనట్లు ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Europe is fighting a 2nd wave of corona pandemic