Home తాజా వార్తలు బ్లాక్‌బస్టర్ హిట్‌గా ‘ఎవరు’

బ్లాక్‌బస్టర్ హిట్‌గా ‘ఎవరు’

Evaru

 

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా పివిపి సినిమా బ్యానర్‌పై వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్‌లో హీరో అడివిశేష్ మాట్లాడుతూ “హిట్ చిత్రాలు క్షణం, గూఢచారి చిత్రాల తర్వాత ‘ఎవరు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.

ఈనెల 15న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. నా కెరీర్‌లోనే ‘ఎవరు’ చిత్రం స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ చిత్ర విజయంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు”అని తెలిపారు. రెజీనా మాట్లాడుతూ “ఎవరు చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో హ్యాపీగా ఉంది.

ఈ చిత్రంలో నా నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. దర్శకుడు వెంకట్ రామ్‌జీ నా నుండి మంచి నటనను రాబట్టుకున్నారు”అని చెప్పారు. దర్శకుడు వెంకట్ రామ్‌జీ మాట్లాడుతూ “ఇది నా ఒక్కడి విజయం కాదు. మొత్తం టీమ్‌ది. ఈ చిత్రంలో అడివిశేష్, రెజీనా అద్భుతంగా నటించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Evaru is a Blockbuster hit Movie