Tuesday, March 21, 2023

పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నా

- Advertisement -

raji

*దళిత, మహిళా కార్పొరేటర్‌ను కాబట్టే వివక్ష
*నా భార్తపై కేసు పెట్టారు
*తన భర్తకు ఏమైనా జరిగితే
ఆత్మహత్య చేసుకుంటా
*కార్పొరేటర్ మెండి శ్రీలతచంద్రశేఖర్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ వైఖరికి నిరసనగా టిఆర్‌ఎస్ పార్టీకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని నగరంలోని 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్ ప్రకటించారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆమె విలేకరుల మాట్లాడుతూ కరీంనగర్ ఎంఎల్‌ఎ ప్రోత్సహంతోనే గతంలో టిఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు.
దళిత, మహిళా కార్పొరేటర్ అయినందునే తనపై వివక్ష చూపుతూ నిధులు ఇవ్వకుండా ఏ లాంటి కార్యక్రమాలకు పిలవద్దని అనుచరులకు ఎంఎల్‌ఎ సూచించారని ఆమె ఆ రోపించారు.తన రాజీనామా లేఖను సిఎం కెసిఆర్‌కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక భూమి విషయంలో తన భర్తకు ఏలాంటి సంబంధం లేకపోయినా కేసు పెట్టించారన్నారు. కేసు పెట్టిన పిటిషన్ దారుడు సైతం కే సును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు రాత పూర్వకంగా ఇచ్చినా పోలీసులు రాజకీయ ఒత్తిడితో అంగీకరించడం లేదన్నా రు. దళితులపై ఎందుకు ఇంత వివక్ష అని ఆమె మండిపడ్డారు. పోలీస్ అధికారులను అడిగితే రాజకీయల ఒత్తిడితో కేసు పెట్టామని అంటున్నారని పేర్కొన్నారు.
ఏ తప్పు చేయని తన భర్తను రాత్రి 10గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారని అన్నారు. తన భర్తకు ఏమైనా జరిగితే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటానని మె ండి శ్రీలత హెచ్చరించారు.
గతంలో కూడా ఎంఎల్‌ఎ వైఖరికి నిరసనగా గతంలో రాజీనామా చేసిన విషయం విదితమే అన్నారు. మహిళా కార్పొరేటర్లపై వివక్ష చూపడం సరికాదన్నారు. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ మాట్లాడుతూ హ క్కుల సాధనకోసం దళిత మైనార్టీ సంస్థను స్థాపించుకుంటే తప్పు ఏంయని ప్రశ్నించారు. తనకు ఏలాంటి సంబంధం లేదని భూమి విషయంలో మధ్యవర్తిగానే పోయానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టాడం ఏమింటని మండిపడ్డా రు. సమస్యల సాధన కోసం దళిత,ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News