Thursday, March 28, 2024

Enlighten Reading అఫ్సర్

- Advertisement -
- Advertisement -

Every time I read this poems, Afsar Mohammed fascinates me with his hard- hitting,blunt images..there is a passion of Sufi and the pain of a common man in his poems. Gulzar
అఫ్సర్ కవిత్వం చదివిన తర్వాత ,ఒక ధ్యానం లాంటి మౌనం లోకి వెళ్ళిన తర్వాత, లోన తెలియని ఒక పేగు కదలిక,పెనుగులాట తర్వాత అఫ్సర్ కవిత్వ సారమంతా గుల్జార్ ఈ రెండు వాక్యాల్లో చెప్పేసాడా అనిపిస్తుంది.
ఒక సూఫీకి అలౌకిక ప్రపంచం ఆలంబన అయితే,ఒక సామాన్య మానవుడికి,ముసల్మానుకి చేదు అనుభవాల, యదార్ధ ప్రపంచమే దిక్కు. ఒక కవిగా ఈ ప్రపంచాన్ని అధిగమించి చూడవలసిన చూపు,ఒక సామాన్యడిగా ఈ ప్రపంచాన్ని అధిగమించలేక చూసే దిగాలు చూపు లేదా ధిక్కారం .. ఏకకాలంలో అనుభవానికి తెస్తాయి అఫ్సర్ కవితలు.
‘I am just a tearlet/ beneath your eye./ The drop/ that can swallow a desert.’ అనగలడు. అదే సమయంలో My poem is not your slave, it’s a sickle with its head to the sky./ My poem is not a damsel timid in your moonlight/ It’s a tiger prowling in a shadowed forest./ My poem won’t be your Constitution, devoted to your happiness at all costs.’

అనీ అదిమిపెట్టిన ఆగ్రహప్రకటన చేయగలడు.ఈ ఆగ్రహాన్ని అదిమిపెట్టడానికి కారణాలు ఈ దేశంలో ముస్లిలను ద్వితీయ శ్రేణి పౌరులుగా అదిమిపెట్టడమే అని తేలిగ్గా ఊహించవచ్చు.దేశంలో మత రాజకీయ పార్టీల అధికార తంత్రం ఒక మతవర్గాన్ని లక్ష్యం చేసుకున్న తర్వాత ఈ పరిస్థితి మరింత విషమించింది.వివక్ష శృతి మించి ఈ నేల పేగు పెనవేసుకొని తరతరాలుగా బతుకుతున్న మనుషులను మతం పేరుతో, ఉనికి పేరుతో దేశం నుంచి వేరు చేయాలని CAA , NRC చట్టం చేయబోతే వెల్లవలా అన్ని చోట్ల నుంచి నిరసన వ్యక్తం అయింది.కడుపు మండిన , గుండె మండిన కవి నుండి కవితాగ్ని ఎగసిపడింది.
‘We lost everything, we’re numbers on the documents, they are happy with their signatures but they can’t see our broken feet. Are we scarecrows in our own fields?’
అన్నప్పుడు కకావికలమైన కాకుల కీకర అరుపుల దృశ్యం కళ్ళపడి, మనసు కళవళపడుతుంది.ఆ దృశ్యం ఒక వేదనగా వెంటాడుతుంది.Scarecrows అనే మాట ఒక ములుకు లాగ పదేపదే గుచ్చుతుంది.ఎంతగా వాళ్ళు బాధ పడితే, ఎంతగా సలసల కాగితే ఈ కవిత బద్దలు కొట్టుకొని వస్తుంది..!

‘In the new theatre, I’m certainly me, and you’re certainly you, no one else./ From now on let’s play our parts straight.’ అని నిఖ్ఖచ్చిగా మాట్లాడే తెగువా వస్తుంది. ‘You know a coward dreams about the war and the battlefield dreams about the warrior. I’m a warrior dreamt by this land’ అనే అంతిమ్ అభిప్రయమూ మెదులుతుంది. Evening with Sufi కవిత నిలువునా ఒక రక్తసిక్త గాయం పళ్ళ బిగువున భరిస్తూ కవి పఠిస్తున్న సూత్రం. ‘I bent my body down /to his feet,reciting verses./ Two eyes changed to two tears/ that shone on the embroidered cloth../ The tears changed to two sparrows/ flung up into nowhere.’

2002లో గుజరాత్ మారణకాండ జరిగినప్పుడు ఉర్దూ మహాకవి వలి గుజరాతీ ( వలి మహమ్మద్ వలి,1667 – 1707 ) సమాధిని అల్లరి మతమూకలు ధ్వంసం చేసినపుడు రాసిన కవిత.రెక్కలు తెగి,ముక్కుల వెంట రక్తం కారుతున్న పిచుకల గోస అలుముకున్న కవిత.రెండు కన్నీటి చుక్కలు రెండు పిచుకలై శూన్యంలోకి ఎగిరిపోయాయని ఆక్రోశించిన కవిత. ముస్లిముల దర్గాల మీద, ఆస్తుల మీద, స్త్రీల మీద, పిల్లల మీద జరిగిన అమానుష కాండకు నిశ్శబ్దంగా విడిచిన రెండు కన్నీటి చుక్కల తడి ఈ కవిత.కవిత కవితంతా అక్షరాలు పేర్చిన దుఃఖం. తన దువాలోనూ, తనలో తన ఆధ్యాత్మిక( spiritual) సంభాషణలలోనూ కవి ఎలా పలుకుతున్నాడో చూడండి.

‘Qibla turning deep/ in the emptiness./ do you see how you are all/ becoming pure ?/ I’ve been like this for years/ burning in the divine fire./ I remain fasting.All year./ Do you see how pure am I ?’ ఇదే అఫ్సర్ భౌతిక ప్రపంచానికి,ఒక సూఫీ కవి ఆత్మిక ప్రపంచానికి వేసిన లంకె. చేసుకున్న సర్దుబాటు. సమన్వయం. ఊగిసలాట నుండి పొందబోవు సాంత్వన.

అఫ్సర్ కవిత్వంలో వ్యక్తమయ్యే వస్తువు, శైలి, భాష, వ్యక్తీకరణ ఆయన స్వయంగా సాధన చేసో, స్వయంసిద్ధంగానో ఏర్పరుచుకున్నది.ఆయన ఆ కవిత్వంలో మాట్లాడుతున్న విషయాలు తెలుగు రాష్ట్రాలలో ముస్లిముల అస్తిత్వ, ఆత్మగౌరవ సమస్యలు ఇప్పుడు మరింత విస్త్రుతంగా, ప్రపంచ ముస్లిముల పరిస్థితుల నేపథ్యంలోకి ఈ కవిత్వాన్ని ఇంగ్లిష్ లోకి తీసుకెళ్లడం ద్వారా జరిగింది.ప్రపంచ దేశాలలో ముఖ్యంగా అమెరికా లాంటి యుద్దోన్మాద దేశాలు ముస్లిములను టెర్రరిస్టు బూచిగా చూపి చేస్తున్న ప్రచారం మూలంగా అంతర్జాతీయంగా ముస్లిముల జీవితాలు అనుమానపు తక్కెడలో తూచబడుతున్నాయి. ఈ దేశంలోనూ, ఇతర దేశాలలోనూ ముస్లిముల జీవితాలలో ఎదుర్కొంటున్న వివక్ష, వేదన అటూఇటుగా ఒకటేలాగా వున్నాయి. ముస్లిమ్ దేశాలలోనూ మత విధేయ ప్రభుత్వాల కారణంగా స్త్రీల అవస్థలు గమనిస్తున్నాం.నేడు అందివస్తున్న విజ్ఞానదాయక విషయాల మూలకంగా ు్మస్లిం స్త్రీలు కూడా మూఢాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం చూస్తున్నాం.

ఈ నేపథ్యంలో అఫ్సర్ ఇంగ్లిష్ కవిత్వం అంతర్జాతీయ వేదిక మీద పురోగామి శక్తుల ప్రశంసలు అందుకోవడం తధ్యం.ఎందుకంటే ప్రపంచంలో భాషలు వేరైనా మానవీయ స్పందనలు ఒక్కటే. కన్నీళ్ళకి అర్థం ఒకటే. ఆకలికి, అజాకి అర్థం ఒకటే. ఇది ఒక కొత్త అనుభూతి వేదన. తెలిసిన అక్షరాలే కొత్త భాషను తొడుక్కొని, ఇంకాస్త లోతును, విస్తృతార్థాన్ని, విశాలమైన యవనిక మీద అనుభవమవుతున్నప్పుడు కలిగే ఈ వేదనానుభూతి భిన్నమయినది.ఈ కవిత్వం ఇచ్చే అనుభవం, నివేదన భిన్నమయినది. ఈ పుస్తకంలోని కవితలు చాలా శ్రద్ధగా ఏరికోరి ఇంగ్లిష్ లోకి మార్చి కూర్చిన కవితలు.శ్రీ శ్రీ మహాప్రస్థానం పుస్తకం లో కవితల్లా ఈ పుస్తకం లో కవితలు కూడా దేనికవే ప్రత్యేకమైనవి. ‘ఎటు చూస్తే అటు ఎడారి/ కనుచూపు మేరా కబేళా/ ఎటో ఒకవైపు అడుగు పడనీ/ అడుగులోనే ఆకాశం కనపడనీ’ / అంటున్న అఫ్సర్ తో కలిసి ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్ లోకి అనువదించిన Shamala Gallagher కూడా ఈ పుస్తకం పట్ల తన అభిప్రాయం ప్రకటిస్తూ ’ It is a sense that is particularly Muslim, particularly post-modern Indian, and particularly Telugu. It is a sense that particularly unafraid of feeling’s bare wire, unafraid of seeing into firepit of the destroyed world, responding with equal parts gentle compassion and rage.’ అన్నారు.

ఈ అభిప్రాయం కూడా అఫ్సర్ కవితా సారం పట్టిస్తుంది. తెలుగు నుండి ఎన్నో క్లాసికల్ గ్రంథాలను ఇంగ్లిష్‌లోకి అనువదించిన హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ షుల్మన్, ప్రముఖ తమిళ కవి, నాటక కర్త,జర్నలిస్టు చేరన్ రుద్రమూర్తి రాసిన అభిప్రాయాలు వున్నాయి.పుస్తకం మొదలే గుల్జార్ రాసిన చిరు అభిప్రాయం అఫ్సర్ కవిత్వాన్ని ఒడిసి పట్టింది. సాహిత్య ఉద్దండులైన వీరు అఫ్సర్ కవిత్వాన్ని చదివి ఒక enlightened feelingతో తమ అభిప్రాయాలు రాయడం అఫ్సర్ కవిత్వంలో వున్న బలం, ఆకర్షణ, గాఢత వల్లనే సాధ్యం అయింది. ఈ పుస్తకం 1, 2 భాగాలుగా వుంది. International standards కు అనుగుణంగా కవితల ముద్రణ, పేజీల అలంకరణ వుంది.ముఖచిత్రమే కొంత కవిత్వం చెపుతుంది.మధ్య మధ్య కవి అఫ్సర్ తెలుగు చేతిరాతతో ఆయన కవితా ఖండికలు తెలుగు కవితా సంపుటులను గుర్తుకు తెస్తూ..అంతర్జాతీయ ఇంగ్లిష్ భాష మధ్య మన తెలుగు ఉనికిని చాటుతూ వుంటుంది.ఈ పద్దతి నేను కొంతమంది ఉర్దూ కవులు ఇంగ్లిష్ లోకి అనువాదమయినపుడు ఆ పుస్తకాలలో గమనించాను. ఇది కూడా ఒక నవ్య అనుభూతి. ప్రతిష్టాత్మక ముద్రణా సంస్థ Red River ప్రచురణ ద్వారా ఈ పుస్తకం అందుబాటులో వుంది.అమెజాన్ లోనూ వుంది. ‘తడిగా తగిలే అమ్మచెయ్యి’ లాంటి కవిత్వానుభూతి కోసం తప్పనిసరిగా చదవాల్సిన కవిత్వం అఫ్సర్ ఇంగ్లిష్ కవితా సంపుటి’ Evening with a Sufi’
పుస్తకం : Evening with a Sufi
కవి : అఫ్సర్
ప్రచురణ : Red River, New Delhi
వెల : 349/-
ప్రతులకు : అమెజాన్

పి.శ్రీనివాస్ గౌడ్- 9949429449

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News