Home జిల్లాలు గోదావరి జలాలతో మెదక్ సస్యశ్యామలం

గోదావరి జలాలతో మెదక్ సస్యశ్యామలం

eeeeeeహల్దీవాగు గోదావరి జలాలతో పరవళ్ళు తొక్కుతోంది.
మంజీరా ఘణపూర్ ప్రాజెక్ట్‌కు వందేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తాం
నిజాంషుగర్స్ (పై) ఛీప్‌సెక్రేటరీతో కమిటీ ఏర్పాటు చేశాం
కరువురక్కసి నుండి ప్రజలను ఆదుకుంటాం
మంచినీటికి ఎద్దడి 300 కోట్లు ప్రభుత్వం కేటాయించింది
42 కోట్లతో ఘణపూర్ ఆనకట్ట ఎత్తు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్:గోదావరి జలాలతో నెర్రలు భారిన మెదక్ జి ల్లా సస్యశ్యామలం అవుతుందని మెదక్ శాస న సభ్యురాలు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ నియోజక వర్గంలో పాపన్నపేట మండలంలో పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్స వంకు వచ్చిన సందర్భంలో ఆమె మాట్లా డారు. మెదక్ జిల్లాకు గోదావరి జలాల వల్ల సస్యశ్యామలం అవుతున్న తీరును రాష్ట్రం సాగునీటి రంగంలో అభివృద్ధి తో పాటు పలు అంశాల మీద ఆసక్తికరంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంగళ వారం తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ సభ్యురాలు డి.కె.అరుణ సభ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ఉద్ధేశిం చి మాట్లాడినప్పుడు విజ్ఞతతో వ్యవహరించిన విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా మహిళగా ఆ మాటకు మనుసుకు బాధై కన్నీరు వచ్చింది. స్పీకర్ స్థానం గుర్తుకువచ్చి మనసు ను రాయి చేసుకొని సభను హుందాగా నడిచేలా ప్రయత్నిం చిన క్షణాలను ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీలో జరిగిన వ్య వహారాలను పక్కన పెట్టండి అని నియోజక వర్గం, రాష్ట్ర అభివృద్ధి విషయాలను చర్చించుకుందామని అన్నారు.
గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలం అవుతుంది…
గోదావరి జలాల వినియోగ విషయంలో రాష్ట్ర ముఖ్య మం త్రి కేసిఆర్ అపరభగీరథుడు అని, మహారాష్ట్రతో ఒప్పందం తో తెలంగాణ సస్యశ్యామలాన్నికి దోహద పడిందని ఆమె కొనియాడారు. జలాల కోసం జగడాలు జరిగే ఈ దేశంలో ఒకే దేశంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, అధికారులు లేకుండా రెండు రాష్ట్రాల మధ్య సామరస్య పరిష్కారాలు జరిపిన చరిత్ర కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌కు దక్కిందని అన్నారు. తుమ్మిడి హట్టి బ్యారేజ్ ఎత్తును 148 మీటర్లకే పరిమితం చేసేలా ప్రాజెక్ట్ పునరాకృతి కల్పించిన ఘతన కేసిఆర్‌కే దక్కిందని అన్నారు. ప్రాణహిత గోదావరి నదుల ను కలిపిన తరువాత కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నూటమూడు మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని మల్లించేలా రీడిజైన్ చేయడంలో ముఖ్యమంత్రి కేసి ఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుల కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి జలాలు 280 టిఎంసిలకు పైగా లభ్యమవుతున్న విషయా న్ని ఆమె స్పష్టం చేశారు. పదిహేను సంవత్సరాలు తెలం గాణ కోసం పోరాడి సాధించుకున్నందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ మహారాష్ట్ర మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం వల్ల తొమ్మిది జిల్లా సస్యశామలం అవుతున్నాయని ఆమె అన్నారు. ప్రాణహితపై ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు మళ్లించే మార్గంలో వేలాది ఎకరాలు ఆయకట్టకు నీళ్లు అందించాలనే లక్షం పెట్టు కోగా, ప్రస్తుతం మారిన డిజైన్ వల్ల రెండు లక్షల ఏకరాల కు నీళ్లు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ సమైక్యాంద్ర పాలనలో అనుమతి ఇవ్వకపోయిన, కాల్వల పేరుమీద ఎనిమిది వేల కోట్లు అడ్వాన్స్ మొగు లేషన్ పేరు మీదా ప్రజా డబ్బు దుర్వినియోగం అయ్యిం దని ఆమె విమర్శించారు. తెలంగాణలోని ఇచ్చంపల్లిపై సమైఖ్య పాలకులు అనవసరమైన పంచాయతీని పెట్టారని, ప్రాజెక్ట్ నిర్మాణాన్నికి డిజైన్ చేయగానే పక్క రాష్ట్రాల వారు అభ్యంతరం చెప్పడం, ఆ తరువాత అతీగతీ లేకుండా పోవ డం సర్వసాధారణంగా చేశారని ఆమె విమర్శించారు. ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులు ఎంతో కష్టపడి మహారాష్ట్ర ప్రభుత్వా న్ని ఒప్పించడం ఆశామాషి కాదని ఆమె అన్నారు.
ప్రాణహిత ద్వారా 140 టిఎంసిల సాగునీరు…
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాణహిత చేవేళ్ల రిజర్వాయర్ సా మర్థం 16 టిఎంసిలు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తనకున్న అపూర్వ పరిజ్ఞానంతో 140 టిఎంసిలకు పెంచ డం ఆయన దూరదృష్టికి నిదర్శనం అని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సాగునీరు లేక మంచినీరు లేక తల్లడిల్లిపోతున్న తెలంగాణ సస్యశామలం కోసం నిరంతరం శ్రమపడుతున్నారని ఆమె ప్రశంసిం చారు. సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా కష్టాలు కన్నీటి గాధలే తప్పా ఏమి లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సింగూర్ ప్రాజెక్ట్‌కు గోదావరి జలాలు…
చుక్కనీరు రాకపోవడం వల్ల మంజీరా పరివాహాక ప్రాంతం తో పాటు సింగూర్ ప్రాజెక్ట్, ఘణాపురం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్‌ల ఆయకట్టు ఏడారి అయిన విషయాన్ని ప్రస్థావించగా ప్రాణహిత ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల ను సింగూర్ ప్రాజెక్ట్‌కు తరలిస్తామని ఆమె తెలిపారు. అం దుకు సంబంధించిన డిజైన్ చేసినట్లు తెలిపారు. ముప్పై టిఎంసిల నీటిని మెదక్ జిల్లాను సస్యశామలం చేయడం కోసం వాడుకుంటామని తెలిపారు. నిజాంసాగర్ కు హల్దీ వాగు నుంచి నేరుగా పదకొండు టిఎంసిలకు పైగా నీరు అందిస్తారని అలాగే మహబూబ్‌నహర్ కాలువ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్‌కు నాల్గు టిఎం సిల నీరు అందిస్తామని తెలిపారు.
వందేళ్ల ఘణపూర్ ప్రాజెక్ట్‌కు పండుగ జేస్తాం..
నైజాం ప్రభుత్వంలో మంజీరా నదిపై మొట్టమొదటగా ని ర్మించిన ఘణాపూర్ ప్రాజెక్ట్ కు మే 1వ తేదీతో 111 సం వత్సరాలు పూర్తి అవుతున్న విషయాన్ని గుర్తుచేయగా ఆమె స్పందించారు. కోట్ల రూపాయల సంపదను సృష్టించి వంద లాది టిఎంసిల సాగునీరును అందించిన ఘణాపూర్ ప్రాజె క్ట్ అడుగడుగునా సమైఖ్య పాలకులు దగా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ప్రాజెక్ట్ లో ఒక తట్ట మట్టి తీయలేదని కుడి, ఎడమ కాలువలకు సిమేంట్ లైనింగ్ చేసిన పాపానపోలేదని ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఘణాపూర్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఘణాపూర్ ప్రాజెక్ట్ లో మట్టి, ఇసుక మేట వేయడంతో నీటి నిలువ సామర్థం తగ్గిపో యిందని ఉద్ధేశ్యంతో 42 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఆ పనికి శంకు స్థాపన చేస్తామని ఆమె తెలిపారు.
కాలువ రోడ్డు అయ్యింది…? సైకిళ్లపై వెల్తున్న దృశ్యం కదిలించింది…
మెతుకుసీమను సస్యశామలం చేసిన ఘణాపూర్ ప్రాజెక్ట్ కుడికాలువ మహబూబ్‌నహర్ కాలువను రాష్ట్ర ముఖ్య మం త్రి, తాను గత సంవత్సరం హెలిక్యాప్టర్‌లో పరిశీలించగా కాలువ పూర్తిగా రోడ్డులాగా మారిపోయింది. సైకిల్ పై ఒక వ్యక్తి వెళ్లడం చూసి ముఖ్యమంత్రితో పాటు తాను ఆశ్చ ర్యం కల్గించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇంత అధ్వా న పరిస్థితిలో ఉన్న కాలువలకు సిమెంటింగ్ లైనింగ్ పను లు పూర్తి అవుతున్నాయని ఆమె తెలిపారు. ఘణాపూర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తానని, అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా కాకతీయ మిషన్ ద్వారా చెరువులు, కుంటలకు మహార్ధశ వచ్చిందని ఆమె తెలిపారు.
మంజీరానదిపై అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు…?
మంజీరాపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో నలపైఆరు కు పైగా రోడ్డు కం బ్రిడ్జిలను నిర్మాణం చేసి చుక్కనీరు రాని వ్వడం లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానం తెలిపారు. సమైఖ్య పాలనలో మంజీరా నదిపై ఆసక్తి కరమైన అంశా లను చర్చించినట్లు ఆమె తెలిపారు. వాటికి సంబంధించిన టేప్‌లను కూడా పరిశీలించాలనుకుంటున్నానని ఆమె తెలి పారు. 1923-31లో నైజాం రాజ్యంలో మంజీరా నదిపై ని ర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ విషయం ప్రస్థావించగా పా లకుల నిర్లక్షం వల్ల పదకొండు టిఎంసిల సామర్థం ఉం డి లక్షల ఏకరాలు సాగులోకి వచ్చి సస్యశామలం అయిన ఆయకట్టు ఉనికి లేకుండా పోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి జలాలు హల్దీవాగు నుంచి మంజీరా నది ద్వారా నిజాం సాగర్‌కు చేరుకుంటుందని ఆమె తెలిపారు.
ప్రజలను కరువు నుండి కాపాడుతాం…
కనివినీ ఎరుగని రీతిలో కరువుతో ప్రజలు తల్లడిల్లిపోతు న్నారని ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధిపని, పనికి ఆహార పథకాన్ని 100 నుంచి 150 రోజులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని ఆమె హామి ఇచ్చారు. రెండు సంవత్స రాల నుంచి తీవ్ర వర్షాభావం వల్ల నీటి ఎద్దడి వల్ల ప్రజలు మంచినీరు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచినీటి కోసం మూడు వందల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్‌ఎంసిఎంఆర్‌ఎఫ్ నిధులు కూడా మంచినీటి కోసం ఖర్చు చేసే అవకాశం ఉందని తెలిపారు.
నిజాం షుగర్స్ పై ఛీప్‌సెక్రేటరీ కమిటీ అధ్యయనం…
నిజాంషుగర్స్ విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. ఛీప్‌సెక్రేటరీతో పాటు కమి టీ సభ్యులు క్షుణ్ణంగా ఆధ్యాయనం చేసి ప్రభుత్వానికి నివే ధిక అందించిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్ చర్య తీసు కుంటారని ఆమె సమాధానం ఇచ్చారు.
బెల్లం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు…
బెల్లం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానం తెలి పారు. ఇటీవల రైతులు మార్క్‌ఫేడ్‌కు అందిన బెల్లం దాదా పు రెండు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్, వైస్‌చైర్మన్ అశోక్, జడ్పీటిసి లావణ్య రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిరెడ్డి క్రిష్ణారెడ్డి, కౌన్సిలర్ మాయా మల్లేశం తదితరులు పాల్గొన్నారు.