Home జగిత్యాల వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు

వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు

am

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
మనతెలంగాణ/జగిత్యాల/మల్యాల: తెలంగాణ రాష్ట్రం లో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీటి వ సతి కల్పించే లక్షంతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గురు,శుక్రవారాల్లో అధి కారులు, ప్రజాప్రతినిధులతో రెండు హెలికాఫ్టర్లలో పర్యటిస్తూ తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వ రం ప్రాజెక్టు బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, కాల్వల నిర్మా ణాల పరిశీలనలో భాగంగా మల్యాల మండలంలోని రాం పూర్-పోతారం పంప్‌హౌజ్ పనులను సిఎం కెసిఆర్ పరి శీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌజ్ పనులు జరుగు తున్న తీరును ఇరి గేషన్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌజ్ స్థలం వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో రైతులు ఇక భవిష్యత్తులో వర్షం కోసం ఎ దురు చూసే పరిస్థితి ఉండకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు నీరందించే విధంగా ప్రణాళిక రూపొందిం చాలని, నీటిపారుదల శాఖ మంత్రిని, అధికారులను ఆ దేశించారు.
రోహిణికార్తేలోనే నాట్లు పడే విధంగా, డిసెంబర్-మార్చి లోపే యాసంగి పంటల ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా రై తులకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాల న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్‌లు అన్ని పూ ర్తి కాగానే వచ్చే జూన్ నుంచి గోదావరి బేసిన్‌లోని అన్ని జి ల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలన్నింటిని యుద్ధప్రాతిప దికన నింపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. ఎక్కడ కూడా సాగునీరు అందని భూములనేవి లేకుం డా గోదావరి బేసిన్‌లోని నదులు, కాల్వలన్నింటిపై చెక్‌డ్యా మ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయా లని అధి కారులను సిఎం ఆదేశించారు. మానేరు నదిలో 4-5, మూలవాగు నదిలో 2-3 వరకు, ఇంకా అవసరం అను కున్న ప్రతిచోట చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సి ద్దం చేయాలని, అందుకోసం అవసరమయ్యే సర్వే చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల నుంచి వ రంగల్ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యపేట, కోదా డ వరకు సాగు నీటిని అందించే విధంగా చూడాలన్నారు. వ్యవసాయం తర్వాత అతి పెద్ద వ్యాపారంగా చేపల పెం పకం నిలుస్తుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకో వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ఎంపి లు బోయినిపెల్లి వినో ద్‌కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్,డిజిపి మహేందర్‌రెడ్డి, సి ఎంఓ అధికారి స్మితా సబర్వాల్, ట్రాన్స్‌కో సిఎండి ప్రభా కర్‌రావు, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు శోభ, విద్యాసా గర్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే తలమానికం
రామడుగులో: రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పను లను ఏకకాలంలో పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ అ ధికా రులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకే తలమానికమని అన్నారు. మండలంలోని ల క్ష్మిపూర్ గ్రామంలో జరుగుతున్న కాళేశ్వరం 8వ ప్యాకేజీ పనులను పరిశీలించడానికి శుక్రవారం మండలానికి వ చ్చిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర భారీ నీటి పా రుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఆర్థిక శాఖ మ ంత్రి ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే బొడిగె శోభ, ము ఖ్యమంత్రి కె.సి.ఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అనం తరం ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న పవర్‌ప్రాజెక్టు దగ్గరికి ము ఖ్యమంత్రి నేరుగా వెళ్లి ప్రాజెక్టు పనులు ఎప్పటికల్లా పూర్తవుతాయని అక్కడున్న అ ధికారులను అడిగి తెలు సుకున్నారు. పంప్ హౌజ్ నుండి నీటిని పంపించుటకు నిర్మించిన గ్రావిట్ కెనాల వద్ద ఉన్న మట్టిని తొలగించాలని వెంటనే సిసి వేసి లైనింగ్ పనులు పూర్తి చేయాలని అ ధికారులను ఆదేశించారు.
కెనాల్ ద్వా రా నీరు త్వరగా వెళ్లుటకు వీలుగా లెవలింగ్ సరిగా చూసు కోవాలని సిఎం పేర్కొన్నారు. భోజ న విరా మ అనంతరం ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసే సమయం లేకపోడంతో సమా వేశాన్ని వాయి దా వేస్తూ ఈ సమావేశాన్ని ప్రగతి భవన్‌లో నిర్వహిం చేందుకు అధికారులను ప్రణాళికను సిద్దం చే యాలన్నారు. వచ్చే జూన్ కల్లా కాళేశ్వరం పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉ ందని అందుకు ఇంజనీరింగ్ అధికారులు కూడా రేయిం బవళ్ళు శ్రమించి ప్రాజెక్టు పనులు పూర్తి చే సేందుకు అధి కారులు కృషి చేయాలన్నారు.
అండర్ గ్రౌండ్, సర్జ్ పూల్, సొరంగ మార్గాలను పర్యవేక్షి స్తారనుకున్న కెసిఆర్ హడావిడిగా పర్యటన ముగించుకొ ని వెళ్లిపోయారు కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భం గా నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాత్రి కేయులు అక్కడికి చేరుకోగా పోలీసులు భద్రత కారణాల వల్ల అత్యుత్సాహం ప్రదర్శించడంతో కొంత అసహనానికి గు రైయ్యారు. ఈ పర్యటనలో కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహా దారు వివేక్, జిల్లా కలె క్టర్ సర్ఫారాజ్ అహ్మద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ టీసీలు సభ్యురాలు వీర్ల కవి త, ఎంపిపి మార్కొండ కిష్టా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.