Home తాజా వార్తలు గ్రామసభలే నిర్ణేతలు

గ్రామసభలే నిర్ణేతలు

Village_manatelangana copyమన తెలంగాణ/హైదరాబాద్: గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయ డం ద్వారా పంచాయతీరాజ్, ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచా ల్సిన అవసరం ఉందని, గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల ప్రకారమే పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారథులుగా ఉండాలని, వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకే గ్రామజ్యోతి పథకాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తే ఫలితం ఉండదని, ఆర్థిక ప్రేరణ మాత్రమే తామిస్తామని, ఈ వ్యవస్థలో నిజమైన మార్పు తేవా ల్సింది ప్రజలేనన్నారు. ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన ప్రారంభించ దల్చిన గ్రామజ్యోతి పథకం (మొదటిపేజీ తరువాయి)
విధివిధానాల రూపకల్పనలో భాగంగా కెసిఆర్ గురువారం ఒక సమావేశం నిర్వహించారు. నగరంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, జా యింట్ కలెక్టర్లు, ఎస్‌పిలు హాజరయ్యారు. సమావేశంలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేం దర్, టి.హరీష్‌రావు, కె.టి.రామారావు, జోగు రామన్న, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్‌శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఐఎఎస్ అధికారులు రేమండ్ పీటర్, అనితా రామచంద్రన్, చొల్లేటి ప్రభా కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామజ్యోతి అంటే గ్రామాలకు నిధులివ్వడమే కాదని, పౌరులలో చైతన్యా న్ని మరింత పెంపొందించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వా ములను చేయడమన్నారు. తమ ఇంటి బాగు కోసం ఏ కుటుంబానికి ఆ కుటుంబం ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగిన మాదిరిగానే, సొంత ఊరు సమగ్రాభివృద్ధి గురించి ప్రజలంతా సంఘటితంగా ముందుకు సాగేందుకే ఈ పథకాన్ని చేపడుతున్నామన్నారు. ఇంటి గురించి పట్టించు కున్నంతా గ్రామం గురించి ఆలోచన చేయమని, తనకు సంబంధం లేని విషయంగా చూస్తామని…ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు, ప్రజలు సంఘటితమయితే, వారి బలం ఏ విధంగా ఉంటుందో నిరూపిం చేందుకే గ్రామజ్యోతికి పథక రచన చేస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో అవసరాలకు అనుగుణంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు నడవాల్సి ఉంటుందని, అందరం కలిసి ముందుకు సాగడం ద్వారా వచ్చే అత్యుత్తమ ఫలితాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరిం చాలని కెసిఆర్ కలెక్టర్లను కోరారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు ప్రజల సంఘటిత శక్తి కూడా తోడయితే మార్పు, ప్రగతి సాధ్యమని, బాగా పనిచేసిన గ్రామాలకు ప్రోత్సాహాకాలు కూడా ఉంటాయని, మరిన్ని నిధులు కూడా సమకూర్చుతామన్నారు. ఈ ఊరికి ఆ ఊరు ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలో, వాటి అమలునకు ఎలా పని చేస్తే బాగుంటుందో వారికి విడమర్చి చెప్పాలని సూచించారు.
ఈ విధమైన పాఠాలను మనం ఎక్కడ నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదని, కళ్ల ముందే మంచి ఉదాహరణలు ఉన్నాయని, వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి, నిజామాబా ద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామాలు సాధించిన అభివృద్ధి గురించి వివరిం చారు. పంచాయతీరాజ్, సహకార వ్యవస్థలు ప్రజల ఉద్యమాల నుంచి పుట్టినవేనని, అత్యుత్తమ పంచాయతీరాజ్ వ్యవస్థ కు ఈ రెండు గ్రామాలు ఆదర్శవంతం కాగా, సహకార రంగం ఉన్నతి గురించి చెప్పుకోవాల్సి వస్తే కరీంనగర్ జిల్లా ముల్కనూర్ గొప్ప ఉదాహరణ అని ముఖ్యమంత్రి చెప్పా రు. పంచాయతీరాజ్ సంస్థల విస్తరణకు, బలోపేతానికి దేశ మొట్టమొదటి కమ్యూనిటీ డవలప్‌మెంట్ శాఖ మంత్రి ఎస్.కె.డే చేసిన కృషి మర్చిపోలేని దన్నారు. ఆయన హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యవస్థ బలోపేతానికి శక్తివం చన లేకుండా కృషి చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. ప్రజల భాగస్వామ్యంతో మిషన్ కాకతీయను విజయవంతంగా కొనసాగిస్తున్నామ ని, దీనిని పలువురు జాతీయ నాయకులు, ప్రముఖులు కూడా ప్రశంసించారన్నారు. మంచినీటి వసతి కూడా లేని సింగపూర్ దేశం వివిధ రంగాలలో సాధించిన అద్భుతమైన ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా గ్రామాలలో వెలుగులు నింపుదామని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమంతా భాగస్వాములమవుదాని కెసిఆర్ చెప్పారు.
గ్రామజ్యోతి…ఆ తర్వాత పట్టణజ్యోతి
గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే పట్టణాల సర్వతోముఖాభివృ ద్ధికి పట్టణ జ్యోతి పథకాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా మార్పు రావలసిన అవసరం ఉంద న్నారు. చిత్తశుద్ధి, పట్టుదల కలిగిన అధికారులు పనిచేసే చోట పట్టణాలలో మంచి ఫలితాలు వచ్చాయని, మిగతా చోట్ల కూడా అదే తీరుగా అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో, సహనంతో పనిచేసి గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ప్రజాప్ర తినిధులు, అధికారులు కలిసి పనిచేయడం ద్వారా ఏ విధమైన ఫలితాలు సాధించవచ్చో ఈ పుష్కరాల నిర్వహణే తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది నిర్వహించే కృష్ణా పుష్కరాలు, మేడారం సమ్మక్క సారక్క జాతరను దేశం అబ్బురపడే రీతిలో నభూతోన భవష్యతి అని కొనియాడే విధంగా మనమందరం కలిసి విజయవంతం చేద్దామన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మొదట పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యతనివ్వాలని, తద్వారా గ్రామంలో ఆరోగ్యవంతమైన వాతావర ణాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా జిల్లా స్థాయి అధికారులు ఒక్కో మండలానికి ఛేంజ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రజలను చైతన్యపర్చాలని కలెక్టర్లకు కెసిఆర్ మార్గ నిర్ధేశనం చేశారు. ఆ తర్వాత నిర్లక్షానికి గురైన దళిత వాడలు, గిరిజన తండాలలో మార్పు తేచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినా కూడా ఆశించిన ఫలితాలు రావడం లేదని, ఈ విషయంలో సమూలమైన మార్పు తేవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామానికి అవసరమైన పనుల గురించి ఐదేళ్ల కోసం ప్రణా ళికలు సిద్ధం చేసుకుని, గ్రామసభల ద్వారా వాటిని ఆమోదింపజేయాల్సి ఉందన్నారు. గ్రామ సభల తీర్మానాలకు అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంటుందని, గ్రామాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుదామని, ప్రజలు సం ఘటిత శక్తితో పనిచేయాలని కెసిఆర్ చెప్పారు. అవసర మైన నిధులిచ్చి, మె రుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రేమండ్‌పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
15న గంగదేవిపల్లిలో ప్రారంభం
గ్రామజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగస్టు 15వ తేదీన వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభిస్తారు. అదే నెల 17వ తేదీ నుంచి 24 వరకు గ్రామజ్యోతి వారోత్సవాలను నిర్వహించాల్సిందిగా కలెక్టర్లకు మార్గదర్శకా లు ఇచ్చారు. ఈ పథకం అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గాను నిర్వహణ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.