Wednesday, April 24, 2024

ప్రతి నీటి బొట్టూ ప్రాణ సమానం

- Advertisement -
- Advertisement -

water Drop

 

ఇంకుడు గుంతలతో వాన నీటిని నిల్వ చేద్దాం : జలమండలి సమావేశంలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ / హైదరాబాద్ : నేడు నీటిని సంరక్షిస్తేనే రానున్న రోజుల్లో నీటి ఇక్కట్లు తప్పుతాయని, భవిష్యత్ తరాలకు నీటి అవస్థలు రాకుండా చూసినవారమవుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. ప్రతి నీటి బొట్టును అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడే జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై , బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఇప్పడు ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై పెద్ద ఎత్తున తగిన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రజల్లో వర్షాకాలానికి ముందే చైతన్యం తీసుకువచ్చేందుకు ఇది సరైన సమయమని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను రాబట్టవచ్చని, భూగర్భ జలాల మట్టాలు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమానాలను ఆయన తిలకించారు.

నీటి సంరక్షణ కార్యక్రమాలు…
ఈ మేరకు వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు ప్రజలంతా కలిసి రావాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, ఈ వేసవి కాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను అందిస్తాయని మంత్రి కెటియార్ చెప్పారు. జలమండలి రూపొందించిన వర్షపు నీరు ఇంకుడు గుంత(రెయిన్ వాటర్ హార్వేస్టింగ్) థీమ్ పార్కును విద్యార్థులు, నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహాన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. థీమ్ పార్కులో రూపొందించిన దాదాపు 42 నీటి సంరక్షణ నమానాలు, పద్ధతులు విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని మంత్రి అభినందించారు.

ఎన్నో వ్యయప్రయాసలకోడ్చి జలమండలి వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీటిని తీసుకువచ్చి, నగరవాసులకు సరఫరా చేస్తుందని మంత్రి కెటిఆర్ వివరించారు. ఇలాంటి శుద్ది చేసిన నీటిని ప్రజలు ఇంటి వద్ద వృథా చేస్తుంటే ప్రభుత్వానికి నష్టంతో పాటు రానున్న రోజుల్లో ఇక్కట్లు ఏర్పాడుతాయని తెలిపారు. మంచినీటిని వృథాను ఆరికట్టడానికి జలమండలి రూపొందించిన వాక్ కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. వాక్ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు సమిష్టిగా నీటివృథాపై అవగాహాన కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామంగా మంత్రి తెలిపారు.

నగరాభివృద్ధిలో జలమండలి…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత హైదరాబాద్ అభివృద్దిలో జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇప్పటీకే ఎన్నో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిందన్నారు. ఇంకా జలమండలి స్వయం సమృద్ది సాధించడానికి, నగరవాసులకు మెరుగైన సేవల కోసం జలమండలి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. అలాగే జలమండలి ప్రధాన నగరంలో మంచినీటి సరఫరా చేసిన జలమండలి ఓఆర్‌ఆర్ గ్రామాల్లో సైతం మంచినీటి సరఫరా చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం ఓఆర్‌ఆర్ ప్రాజెక్టును 193 గ్రామాల్లో పనులు చేపట్టి, మంచినీటి సరఫరా చేపడుతుందని వివరించారు. వేసవికాలంలో ఓఆర్‌ఆర్ గ్రామాల్లో నీటి ఇక్కట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ శివారు మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న సెవరెజీ నిర్వహణను మార్చి 1 నుంచి జలమండలి చేపడుతుందని తెలిపారు. విషయంలో పక్కా ప్రణాళికతో అయా ప్రాంతాల్లోని సెవరెజీ నిర్వహణకు సన్నద్దం కావాలని సూచించారు. ఈ సందర్భంగా జలమండలి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తయారుచేసిన ప్రత్యేక యూనిఫామ్ జాకెట్ తో పాటు నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం వాక్ కు సంబంధించిన క్షేత్రస్థాయి వివరాలు నమోదు చేసుకోవడానికి రూపొందించిన డైరీని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు.

Every water Drop is equivalent to life
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News