Home వార్తలు ఏటా రూ.12వందల కోట్లు

ఏటా రూ.12వందల కోట్లు

Every  year 12000 crore given to farmers on rythu bandhu

మన తెలంగాణ/న్యాల్‌కల్ : రైతే రాజు అన్న నానుడిని నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అడుగులు ముందుకు వేస్తున్నారని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్ర భుత్వం రైతుల అభ్యున్నతే ధ్యేయంగా మసు లు కుంటోందని ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లో రైతులకు రైతు బంధు పథకంలో చెక్కులు, పాసుపుస్తకాలు అందచే శారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రూ.16వేల 124 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో విద్యుత్ కోత మూలంగా వ్యవసాయ భూములు బీడు భూములుగా మారాయని, టిఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడ్డాక నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండటంతో బీడు భూములు సాగులోకి వచ్చాయని, ఫలితంగా రైతులు ఆనందంలో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరగా ఉండా లన్న లక్షంతో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చి పాలన ప్రజల దగ్గరకి చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు  రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే అని రైతుల అభివృద్దే ద్యేయంగా 70 ఏండ్లుగా మాట్లాడుతూ వచ్చారని, అయితే తొలి మారు రైతుల గురించి పట్టించుకుని వారి అభివృద్దికి అనేక సంక్షేమ పథకాలు (రుణా లు మాఫీ, వ్యవసాయానికి పెట్టుబడి, నిరంతం విద్యుత్ సరఫరా,మిషన్ కాకతీయ) అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు.

కోటిన్నర ఎకరాలకు  సాగునీరు, ప్రజలకు ఇంటింటికి తాగునీరు అం దిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నిత్యం రైతు ల పక్షాల ఆలోచించే ప్రభుత్వం దేశంలోనే ఒక్క తెలంగాణ ప్రభుత్వమ న్నారు. రైతుల నుంచి పంట ధాన్యాలను కొనుగోలు చేస్తోందని, ప్రతి మండలంలో గోదాములు నిర్మించి రైతుల పంట గింజలను దాచుకు నేలా చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. రైతు నమన్వయ కమిటి రాష్ట్ర అధ్యక్షులు గుత్తాసుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లే ని విధంగా రైతు కమిటీలను నియమించి (గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర) రైతుల పాట్లను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నది మన రాష్ట్రమే అని గుర్తు చేశారు. సమితి బాధ్యులు ప్రభుత్వం నుంచి వచ్చే విషయాలను రైతుల చెంతకు చేరేలా చూడాలని, రైతుల కష్టాలను పరిష్కరించేలా వ్య వహరించాలని రైతు సమన్వత సమితి బాధ్యులకు సూచించారు. కార్య క్రమంలో ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, రాములు నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ వెంకట్‌రాంరెడ్డి, జిల్లా ఎస్సీ చం ద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎంపిపి అధ్యక్షులు కమ లా బాయి పాటిల్, నాయకులు చంద్రప్ప, మాణిక్‌రావు, రవీందర్, మాతం శెట్టి రాజ్‌కుమార్, ఎంఆర్ ప్రవీణ్‌కుమార్, జెట్టుగొండ మారుతి యాద వ్, సుధీర్‌కుమార్,  ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలున్నారు.