Home తాజా వార్తలు ఊరేగింపులు నిషిద్ధం…

ఊరేగింపులు నిషిద్ధం…

Election Commission

 

రేపటి కౌంటింగ్‌కు 10వేల మందితో భారీ బందోబస్తు మీడియాతో అదనపు డిజి జితేందర్

హైదరాబాద్: ఎన్నికల సంఘం నియామవళిని ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర అదనపు డిజి జితేందర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు, భద్రత ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్బం గా ఎడిజిపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 37 పో లింగ్ కేంద్రాలలో ఇవిఎంలను భద్రపరిచామన్నా రు. కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాలకు ఇవిఎంలను తరలించనున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి అబ్జర్వర్లు ఉంటారని, కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి పాస్‌లు ఉన్న వ్యక్తులు మాత్రమే లోనికి అనుమతిస్తారన్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలు నిషిద్ధమని, పోలీసుల అనుమతి తీసుకున్న తరువాతే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు.

ఒక్కచోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడడం జరిగిందన్నారు. నిజామాబాద్‌లో కౌంగింగ్‌కు చాలా సమయం పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కౌంటిగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 34,603 పోలింగ్ కేంద్రాలలో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఇవిఎం,వివిప్యాట్‌లను 37 కేంద్రాల్లోని 123 స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచామన్నారు.ఇవిఎంలను భద్రపరిచిన ప్రాంతాలలో మూడంచెల భద్రత కల్పించడం జరిగిందన్నారు.కాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు ఆంక్షలుంటాయని, ఆర్‌ఒ నుంచి అనుమతి పొందినవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలలోకి అనుతిస్తామన్నారు.

ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద శక్తివంతమైన సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎన్నికల ఫలితాల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాలలో 10వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నామన్నారు. ఈక్రమంలో రాష్ట్రంలోని 37 పోలింగ్ కేంద్రాలకు ఈనెల 22వ తేదీ ఉదయానికే బలగాలు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నాయని, కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు పోలీసులు ఆంక్షలు, బందోబస్తు నిర్వహించనున్నామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఎన్నికల ఫలితాల రోజు అదనపు బలగాలను తరలించనున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతరం లేకుండా నిర్వహించేందుకు ముందస్తుగా రౌడీషీటర్లను బైండోవర్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు ఎడిజి జితేందర్ తెలిపారు. రాష్ట్రంలోని 37కౌంటింగ్ కేంద్రాలలో కేంద్ర బలగాలను సైతం వినియోగించనున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తారని వివరించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిమిత్తం అన్ని విధాల ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎడిజి తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న విషయాలను సిపి, డిజిపి కార్యాలయం నుంచి మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షించనున్నామన్నారు.

Everyone follow the rules of the Election Commission