Saturday, April 20, 2024

పర్యావరణహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : పర్యావరణరహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు.సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణంలో గల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి స్థానిక మండల అభివృద్ధి అధికారి కార్యాలయము వరకు సాగిన పర్యావరణ రహిత జీవన శైలిపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పత్తి పాల్గొని ప్ర్రారంభించారు.

ఈసందర్భంగా మొక్కలు నరకవద్దని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించవద్దని, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గిద్దామని, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించాలని కోరారు, పర్యావరణాన్ని పాడుదామనే నినాదాలతో నిర్వహించిన ర్యాలీలో రాజకీయ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, వివోఏలు, యువకులు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాల సంరక్షక సదన్ లోని చిన్నారులు మొక్కల యొక్క ఔన్నత్యాన్ని తెలియచేసే కార్యక్రమాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో కాలుష్య నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ హితకరమైన పనులను పాటించాలని, భావి తరాలకు మంచి వాతావరణం కల్పించే కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని ఆమె కోరారు. ప్రాణికోటి జీవనశైలికి ఉపయోగపడే సరక్షిత నీరు, గాలి సద్వినియోగానికి పాటుపడాలని, చెట్లు నరకవద్దని, మొక్కల పెంపకం, మొక్కల సంరక్షణపై అధిక శ్రద్ధ కనబరచాలని, అవసరమైన మేరకే త్రాగునీరు, విద్యుత్ వినియోగించుకోవాలని, వాటిని దుర్వినియోగం చేయవద్దని, ప్లాస్టిక్ వస్తువులను క్రమంగా తగ్గిస్తూ క్లాత్ వస్తువులను వినియోగించాలని, పేపర్ వినియోగంలో పొదుపు పాటించాలని అన్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి, ఎంపిపి నరాల నిర్మల, జడ్పిటిసి బీరు మల్లయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, ఎస్.సి. కార్పోరేషన్ ఇడి శ్యాంసుందర్, జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, కాలుష్య నివారణ మండలి అధికారి సజీనా, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా యువజన అధికారి ధనంజయ్, మండల అభివృద్ధి అధికారి గుత్తా నరేందర్ రెడ్డి, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News