Home బిజినెస్ ఇన్ఫోసిస్‌లో అంతా బాగుంది..

ఇన్ఫోసిస్‌లో అంతా బాగుంది..

infosys

కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి

న్యూఢిల్లీ: కంపెనీలో అంతా బాగుందని, అన్ని సమస్యలను పరిష్కరించే సామర్థం చైర్మన్ నందన్ నిలేకనీకి ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకు డు నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. 2017 18కి గాను ఇన్ఫోసిస్ బహుమతులను అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చైర్మన్‌గా నందన్ అన్ని సమస్యలు సులువుగా పరిష్కరిస్తారని, మేము సంతోషంగా నిద్రి స్తున్నాం’ అని అన్నారు. నిలేకని చాలా సామ ర్థం కలిగినవాడు, క్లిష్టమైన స మస్యలను సులభంగా పరిష్కరించగలరని నారాయణ మూర్తి అన్నారు. నిలేకనీకి స్వేచ్ఛ ఇచ్చామని, అంతా నిశబ్దంగా ఉంటే చాలు, ఆయన ప నులు చక్కబెట్టుకొస్తారన్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ దిగ్గజం పనాయను 200 మిలియన్ డాలర్లకు కొనుగోలు వ్యవహారంలో నిలేకని క్లీన్‌ఛిట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో మూర్తి వ్యాఖ్య లుప్రాధాన్యతను  ఉత్తమ సిఇఒగా గుర్తింపు పొందిన నిలేకనీకి ఎవరి సలహా లు అవసరం లేదని అన్నారు. విశాల్ సిక్కా రాజీనామా తర్వాత ఇన్ఫీకి కొత్త సిఇఒ కోసం బోర్డు సభ్యులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సి ఇఒ రేసులో ఉన్నట్టు ఇన్ఫీ మాజీ ఉద్యోగి అశోక్ వేమూరితో పాటు పలువురి పేర్లు మీడియాలో హల్‌చల్ చేశాయి. వేమూరి స్పందిస్తూ, తానేమీ ఇన్ఫోసిస్ సిఇఒ రేసులో లేనని స్పష్టం చేశారు.