Thursday, March 28, 2024

మహిళా కౌన్సిలర్ పై బిజెపి మాజీ ఎంఎల్ఎ అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మాజీ బిజెపి ఎంఎల్‌ఎ తనపై అత్యాచారం చేశాడని మహిళా కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్ర థానే జిల్లా భయాందర్ టౌన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాజీ బిజెపి ఎంఎల్‌ఎ నరేంద్ర మోహతా, ఆయన అనుచరుడు సంజయ్ తార్త్‌రే తన లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కౌన్సిలర్  మిరా భయాందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 1999 నుంచి నరేంద్ర మోహతా తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. నరేంద్ర, సంజయ్‌పై ఐపిసి 376 (రేప్), ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. దీంతో నరేంద్ర మోహతాను బిజెపి పార్టీ సస్పెండ్ చేసింది. మాజీ బిజెపి ఎంఎల్‌ఎను వెంటనే అరెస్టు చేయాలని శివసేన ఎంఎల్‌ఎ ప్రతాప్ సర్‌నాయిక్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మహిళలకు రక్షణ లేదన్నారు.

 

Ex-BJP MLA Narendra Mehta rape on Women Corporator
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News