Home తాజా వార్తలు ఆ విషయంలో కోహ్లీ జీనియస్: కుంబ్లే

ఆ విషయంలో కోహ్లీ జీనియస్: కుంబ్లే

Anil Kumble with Virat Kohliముంబయి: పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ తో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వాగ్వాదం పలువురి విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు విరాట్ ను సమర్థిస్తుంటే.. ఇంకొందరు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఈ విషయమై భారత జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా స్పందించారు. వివాదాల నుంచి ఎలా బయటపడాలో కెప్టెన్ కోహ్లీకి బాగా తెలుసని కుంబ్లే అన్నారు. ఎదుటివారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంచనావేయగల సత్తా కోహ్లీకి ఉందని ఆయన తెలిపారు. ఈ వివాదం నుంచి విరాట్ త్వరలోనే బయటపడతాడని చెప్పారు. వివాదాల నుంచి ఎలా బయట పడాలో కూడా అతడికి బాగా తెలుసునన్నారు. ఇక కోహ్లీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, మ్యాచ్‌ల్లో అతడి ప్రతిభ అత్యున్నత స్థాయిలో ఉంటుందని కుంబ్లే కొనియాడారు.

 మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకొని రాణించడంతో విరాట్ దిట్టా అని ప్రశంసించారు. ప్రస్తుతం మూడు ఫార్మేట్లలోనూ కోహ్లీ అదరగొడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ తో కోహ్లీ పోలికను తానెప్పుడూ సమర్థించనన్నారు. విరాట్ కు ఇంకా భవిష్యత్తు ఉందని, ఎన్నో రికార్డులను తిరగరాయగలడని చెప్పుకొచ్చారు. ఒకటి రెండు సంఘటనలు చూసి కోహ్లీని క్రికెట్ దేవుడితో పోల్చడం సరికాదన్నారు. సచిన్ ఆడిన నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నయని తెలిపారు. కాని సచిన్ రికార్డులను అందుకోగల క్రికెటర్ ఎవరైన ఉన్నారంటే అది కోహ్లీ మాత్రమేనని కుంబ్లే పేర్కొన్నారు.

Ex Coach Anil Kumble Praises Indian Captain Virat Kohli