Home జాతీయ వార్తలు ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కన్నుమూత

 

న్యూఢిల్లీ: మూడుసార్తు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 81 సంవత్సరాల షీలా దీక్షిత్ ఢిల్లీ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె గతంలో కేరళ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె మృతికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని ప్రధాని కీర్తించారు. కాంగ్రెస్ పార్టీ ఆమె మృతి పట్ల సంతాపం తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి ప్రకటించడంతో పాటు ఆత్మస్థైర్యం ఇవ్వాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 

 

Ex-Delhi CM Sheila Dikshit passes away at 81