Home అంతర్జాతీయ వార్తలు న్యూయార్క్ ఆస్పత్రిలో వైద్యుడి కాల్పులు

న్యూయార్క్ ఆస్పత్రిలో వైద్యుడి కాల్పులు

Bronx-Lebanon-Hospital

న్యూయార్క్: అమెరికా రాజధాని న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో ఓ వైద్యురాలు మృతిచెందగా, మరో ఆగురికి గాయాలయ్యాయి. ఘటన వివరాల్లోకి వెళితే… న్యూయార్క్‌లోని బ్రాక్స్-లెబనాన్ ఆస్పత్రిలోకి ఓ వ్యక్తి వైద్యుడిలా చేతిలో తుపాకీతో ప్రవేశించాడు. భవనంలోని 16,17 అంతస్థుల్లోకి వెళ్లి రోగులు, వైద్యులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

అనంతరం తనను తాను కాల్చుకుని, ఒంటికి నిప్పంటించుకున్నాడు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేసరికే నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దుండగుడి కాల్పుల్లో ఓ వైద్యురాలు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే నిందితుడు ఓ ఫిజీషియన్ అని గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేసినట్లు తెలుస్తోంది.