Friday, March 29, 2024

పాక్ ముందు వరుస స్థావరాల్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యాం

- Advertisement -
- Advertisement -

Ex IAF chief Dhanoa says on bringing Abhinandan

 

అభినందన్‌ను బంధించిన ఘటనపై ఐఎఎఫ్ మాజీ చీఫ్ ధనోవా

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఎఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయడం మినహా మరో అవకాశమేదీ పాకిస్థాన్‌కు ఆ సమయంలో లేదని ఐఎఎఫ్ మాజీ చీఫ్ బిఎస్ ధనోవా స్పష్టం చేశారు. 2019 ఫిబ్రవరిలో మిగ్21 పాక్ భూభాగంలో కూలిపోగా అభినందన్‌ను ఆ దేశ సైన్యం బంధించిన విషయం తెలిసిందే. భారత సైనిక దళాల సామర్థం పట్ల సరైన అవగాహనతోనే పాక్ సైన్యం అభినందన్‌ను విడిచిపెట్టిందని ధనోవా తెలిపారు. మొదట దౌత్య, రాజకీయ మార్గాల్లో పాక్‌పై ఒత్తిడి చేశామని, దారికిరాని పక్షంలో పాక్ సైనిక దళాల ముందు వరుస స్థావరాల్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యామని ధనోవా తెలిపారు. ఆ సమయంలో రక్షణశాఖకు చెందిన మూడు విభాగాలు సర్వ సన్నద్ధతో ఉన్నాయని ఆయన తెలిపారు. అభినందన్ అంశంలో పాక్‌లో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా కాళ్లు వణికిపోయాయంటూ ఆ దేశ ఎంపీ అయాజ్ సాదిఖ్ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ, వాస్తవ పరిస్థితి అదేనని ధనోవా స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News