Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కరోనాతో మాజీ మంత్రి ఖలీల్ బాషా కన్నుమూత

కరోనాతో మాజీ మంత్రి ఖలీల్ బాషా కన్నుమూత

Ex Minister Khaleel Basha Died With Coronaహైదరాబాద్ : మాజీ మంత్రి ఎస్ఎ ఖలీల్ బాషా కరోనాతో కన్నుమూశారు. బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు బాషాకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. మాజీ సిఎం ఎన్ టిఆర్ కాలంలో బాషా రెండు సార్లు ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు.  మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాషా పనిచేశారు. కడప జిల్లాలో ఆయన మంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండానే ఆయన పేదలకు వైద్యం చేసేవాడు. ఇటీవలే బాషా వైసీపీలో చేరారు. బాషా మృతిపై  కడప  జిల్లా టిడిపి అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి  బాషా చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. జనసేన కడప నియోజకవర్గ ఇన్‌చార్జి, రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ తదితరులు బాషా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.