Home జయశంకర్ భూపాలపల్లి మాజీ మంత్రి నరసింహారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి నరసింహారెడ్డి కన్నుమూత

Ex Minister Madati Narasimha Reddyహైదరాబాద్ : ఉమ్మడి ఎపి మాజీ మంత్రి మాదాటి నరసింహా రెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన నరసింహారెడ్డి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు అత్యంత సన్నిహితులు. నర్సింహారెడ్డి, టిడిపిలో పలు పదవుల్లో పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ నరసింహారెడ్డి  కీలక పాత్ర పోషించారు. శుక్రవారం నరసింహారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పై తెలంగాణ సిఎం కెసిఆర్, కరీంనగర్ మాజీ ఎంపి వినోద్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Ex Minister Madati Narasimha Reddy Passed Away