Home తాజా వార్తలు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో కెసిఆర్ పాలన : రమణ

అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో కెసిఆర్ పాలన : రమణ

Ex Minister Ramana Tributes To Telangana Martyrsహైదరాబాద్‌ : తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సిఎం కెసిఆర్ పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, టిఆర్ఎస్ నాయకుడు ఎల్.రమణ పేర్కొన్నారు. శుక్రవారం రమణ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు ఎన్నడూ మరువలేనివని ఆయన స్పష్టం చేశారు. అమరవీరుల ఆశయాల సాధనలో భాగంగా బంగారు తెలంగాణను తయారు చేసేందుకు కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన కెసిఆర్ సమక్షంలో తన అనుచరులు చేరనున్నారు.