Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మాజీ ఎంఎల్‌ఎ కన్నుమూత

మాజీ ఎంఎల్‌ఎ కన్నుమూత

Ex MLA Gadam Kamaladevi Passed Away

కాకినాడ : మాజీ ఎంఎల్‌ఎ గాదం కమలాదేవి (86) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1972లో పామర్రు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఆమె ఎంఎల్‌ఎగా గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా, టిటిడి మెంబర్‌గా, క్వాయర్ బోర్డ్ మెంబర్‌గా కమలాదేవి పని చేశారు. కాకినాడలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి కృషి చేశారు.. కమలాదేవికి రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కొడుకులు, అనురాధ అనే కూతురు  ఉన్నారు. కమలాదేవి పీఏసీ చైర్మన్‌గా కూడా పని చేశారు. కమలాదేవి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

Ex MLA Gadam Kamaladevi Passed Away