Home ఖమ్మం రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు గాయాలు

Ex MLA Gummadi Narsaiah Injured in Road Accidentఖమ్మం : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు  టేకులపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో   ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. నర్సయ్యను చికిత్స కోసం ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమైంది. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తుండగా గుమ్మడి నర్సయ్య ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.