Home తాజా వార్తలు కెటిఆర్, సంతోష్ లకు రాఖీ కట్టిన కవిత

కెటిఆర్, సంతోష్ లకు రాఖీ కట్టిన కవిత

Ex MP Kavitha Knot Rakhi To KTR And Santoshహైదరాబాద్ : రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత తన అన్నలు మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్ కుమార్ లకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా  కెటిఆర్, సంతోష్ కుమార్, కవితలు రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలు బలోపేతం కావాలని, సమాజంలో ప్రతి మహిళను గౌరవించడమే ఈ రాఖీ పండుగకు ప్రతీక అని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమానుబంధాలతో చూడడం భారత సంప్రదాయమని వారు పేర్కొన్నారు. అదేవిధంగా రాఖీ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.