Home Default నిలకడగా మన్మోహన్ సింగ్‌ ఆరోగ్యం

నిలకడగా మన్మోహన్ సింగ్‌ ఆరోగ్యం

Ex PM Manmohan Singh Health Consistentlyన్యూఢిల్లీ : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్‌ ఆరోగ్యంపై శుక్రవారం ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ కోలుకుంటున్నారని వారు తెలిపారు. మన్మోహన్ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తదితర రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.