Home జాతీయ వార్తలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమం

Ex President Pranab Mukherjee Health Condition Criticalఢిల్లీ : మాజీ  రాష్ట్రపతి, కాంగ్రెస్ అగ్రనేత నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో రెండు రోజుల క్రితం ప్రణబ్ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రణబ్ కు క్లిష్టమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రణబ్ ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు మూడు రోజుల క్రితం ప్రణబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.