Home కరీంనగర్ కలెక్టర్లకు ఎక్సలెన్సీ అవార్డులు

కలెక్టర్లకు ఎక్సలెన్సీ అవార్డులు

Excellence Awards for collectors

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్వహణ, కెసిఆర్ కిట్ల పంపిణీలో సమర్థవంతమైన సేవలు అందించినందుకుగానుజిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అ హ్మద్ సోమవారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వ నరుల అభివృధ్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎక్స్‌లెన్సీ అవార్డును అందుకున్నారు.రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి,పురపాలక శాఖ మంత్రి కె. తా రకరామారావు,ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో నూతనంగా నిర్మించి న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఈ ఆసుపత్రి లో కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా మౌలిక వసతులు క ల్పించడం కోసం కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లే గర్భిణీ ల ను అక్కడి వైద్య సిబ్బంది మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రిఫర్ చేసే విధంగా కలెక్టర్ ఒక విధానాన్ని రూపొందించారు.దీంతో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చే ఔట్ పేషంట్ల సంఖ్య 100 నుంచి మూడు వందలకు పైగా పెరుగుతూ వచ్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇందులో 7059 ప్రసవా లు నిర్వహించగా మొత్తం 5900 మందికి కెసిఆర్ కిట్లను అందజేశారు.దీంతో స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రం రాష్ట్రంలోనే కెసిఆర్ కిట్ల పంపిణీలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కేంద్రంలో ప్రతి నెల 800లకు పైగా ప్రసవాలు జరిగేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కలెక్టర్‌తో పాటు, జి ల్లా వైద్య ఆరోగ్య శాఖ మాజీ అధికారి డాక్టర్ రాజేశం, మాతా శిశు కేంద్రం పాలనాధికారి డాక్టర్ అలీం సంయుక్తంగా ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్నారు.
ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్‌ను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్స్‌లెన్సీ (టెక్సా) అవార్డు – 2018ని అందించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో చురుగ్గా వ్యవహరించి ప్రశంసలు పొందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం,రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉత్త మ అధికారులకు అందించే టెక్సా – 2018ని ప్రకటించారు. అ వార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మా ట్లాడుతూ మంత్రి కెటిఆర్ మార్గదర్శనం,మున్సిపల్ అధికారుల, సిబ్బంది కృషి, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే తనకు ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్సీ అవార్డు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ డా.కెవి రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ రాష్ట్ర ప్రభు త్వ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. 2017లో ధా న్యంసేకరణలో జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థా నంలో నిలిపిన జిల్లా కలెక్టర్ (మిగతా 3లో)