Home తాజా వార్తలు మతాలపై వెలుగెత్తిన సినిమాలు

మతాలపై వెలుగెత్తిన సినిమాలు

Movies

 

మతాన్ని సరైన అర్థంలో అవగాహన చేసుకోడానికి వివిధ మతాలపై చలన చిత్రాలొచ్చాయి. ఒక్కో మతం ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది. ఎలా వ్యాప్తి చెందింది. ఏం సాధించింది? దాని ప్రాథమిక సూత్రాలేమిటి? వంటి విషయాలు ఆలోచించినపుడు మనిషి మనిషిగా బతకాలని అన్ని మతాలు చెబుతున్నాయి. వాటి సారాన్ని తెలియజెప్పే కొన్ని ముఖ్యమైన సినిమాలు చూస్తే చాలు. ఎందుకంటే, ఆయా చిత్ర దర్శకులు ఎంతో అధ్యయనం చేసి, పరిశోధన చేసి తమకంటూ ఒక నిర్దుష్టమైన అవగాహన ఏర్పరుచుకుని తీశారు కాబట్టి ‘ఇస్లాం ఇన్ ఇండియా’ అనే సినిమాను దర్శకురాలు షమాజైద్ రూపొందించారు.

ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన కన్నడ సినిమా ‘ఘటశ్రాద్ద’. ఇది దర్శకుడు గిరీష్ కాసరవల్లి తొలి చిత్రం. దీని ఇతివృత్తమేమిటంటే నీతి తప్పి “పాపాత్ము” రాలైన బ్రాహ్మణ విధవరాలికి కుటుంబంతో అన్ని సంబంధాలను తెగ తెంపులు చేయడం ‘ఘటశ్రాద్ద’ ముఖ్యోద్దేశం! మనిషి చనిపోయినప్పుడు చేసే వైదిక కర్మలతో ఇది సమానం. కాని భేదం ఏమిటంటే ‘పాప పంకిలమైన’ ఆత్మ ఇక్కడ సజీవంగా ఉంటుంది. అంటే విధవరాలు బతికి ఉండగానే ఆమెకు శ్రాద్దం పెడతారన్నమాట. ఆమెకు కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి.

ఆస్తిపాస్తుల మీద హక్కు పోతుంది. బ్రాహ్మణ అగ్రహారం నుండి బహిష్కరింపబడుతుంది. ఆచార కర్మలలో ఒక మట్టి పాత్రను పగలగొడతారు. ఇక్కడ మట్టి పాత్ర ఆ స్త్రీ గర్భానికి సంకేతం! అంటే సంతానోత్పత్తి అర్హతను పగలగొట్టడ మన్నమాట!! బాల్య వివాహాల వల్ల, యవ్వన దశలోనే విధవరాలైన యువతిని జీవచ్ఛవంగా తయారు చేస్తారు. ఆమె బతికి ఉండగానే తద్దినం పెట్టే నీచమైన ఆచారం ఇది. ఎందరో సంఘ సంస్కర్తలు, మరెందరో హేతువాదులు పూనుకుని మార్పు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటే, సమాజం ఈ దశకైనా వచ్చింది. అయితే రావల్సిన మార్పు ఇంకా చాలా ఉంది. 

“గాడిద లొటపెట అయితదా అన్న అనుమానమే వద్దు. రాజకీయం మందుదింటె ఏది ఏదన్న గావొచ్చు” 1970 లో తెలంగాణ ప్రజల భాషలో నేను ప్రచురించిన కవితా చరణం! రాజకీయాల్లోకి పౌరాణిక పాత్ర అయిన రాముణ్ణి లాగొచ్చు. చరిత్ర నుండి బాబర్ (బాబ్రీ)ని లాగొచ్చు. మహిమల్ని లాగొచ్చు. మతాల్ని లాగొచ్చు. మత కలహాల పేరుతో దేశ ప్రజల భయభ్రాంతుల్ని కూడా రాజకీయం చెయ్యొచ్చు. అసలైతే చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. ఈ దేశంలో మత సహనం జాతి సంస్కృతిలో అంతర్భాగమని! రాజకీయం ఒకోసారి ఒక్కో విషయంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఉపయోగించుకుంటుంది. మత కలహాల పేరుతో జరిగిన హత్యాకాండల్లోంచి రాజకీయాన్ని మైనస్ చేసి చూడండి. చెదురు ముదురు సంఘటనలు, చిన్న చిన్న పాత కక్షలు తప్ప, మతాల మధ్య, సామాన్యుల మధ్య నిజంగా కలహాల్లేవ్. జరిగింది జరుగుతూ ఉన్నది అంతా రాజకీయ వారసులు పోటీ పడడమే.

మతాన్ని సరైన అర్థంలో అవగాహన చేసుకోడానికి వివిధ మతాలపై చలన చిత్రాలొచ్చాయి. ఒక్కో మతం ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది. ఎలా వ్యాప్తి చెందింది. ఏం సాధించింది? దాని ప్రాథమిక సూత్రాలేమిటి? వంటి విషయాలు ఆలోచించినపుడు మనిషి మనిషిగా బతకాలని అన్ని మతాలు చెబుతున్నాయి. వాటి సారాన్ని తెలియజెప్పే కొన్ని ముఖ్యమైన సినిమాలు చూస్తే చాలు. ఎందుకంటే, ఆయా చిత్ర దర్శకులు ఎంతో అధ్యయనం చేసి, పరిశోధన చేసి తమకంటూ ఒక నిర్దుష్టమైన అవగాహన ఏర్పరుచుకుని తీశారు కాబట్టి ‘ఇస్లాం ఇన్ ఇండియా’ అనే సినిమాను దర్శకురాలు షమాజైద్ రూపొందించారు. భారత దేశపు కోస్తా ప్రాంతాలలో అరబ్బులు వ్యాపారం చేయడం, మహ్మద్ బీన్ ఖాసిన్, సింధ్ దాని పరిసర ప్రాంతాల్ని జయించడం టర్కీ, ఆఫ్ఘానిస్థాన్‌ల నుండి ఎంతో మంది ఈ దేశాన్ని ఆక్రమించడం, స్థావరాలేర్పరుచుకోవడం ఇస్లాం మత ప్రాప్తికి, వ్యాప్తికి ఎందో దోహదం చేశాయి.

అలాగే సూఫీ మత నాయకులూ, భక్తులూ అయిన డాటా గంజ్‌షకర్, మొయినొద్దీన్ కిస్తీ, బఖ్తార్ ఖాకి, బాబా ఫరీద్, సయ్యద్ అలా హమాదాన్ షమ్స్ తబ్రిజి వంటి వారంతా ఈ నేల మీద శాంతి, సంతోషాల్ని నిలిపిపోయారు. అందుకే వేల యేళ్ల నుండి ముస్లిం సంప్రదాయాలు, జీవిత విధానాలు భారతీయ సంస్కృతిలో భాగమయ్యాయి. రెండు గంటల పాటు నడిచే ఈ ఇంగ్లీషు చిత్రాన్ని షమాజైది ప్రతిభావంతంగా తెచ్చారు. ఈమెకు లోగడ శ్యాం బెనెగల్ చిత్రాలకు స్క్రిప్టు రాసిన అనుభవముంది. సత్యజిత్ రే ‘షత్రంజ్‌కి కిలాడి’ కి కాస్టూమ్స్ సమకూర్చిన అనుభవముంది. ఎం.ఎస్.సత్యు ‘గరహ హవా’, ‘కన్నేవ్వర్ రామా’, ‘బరి’ వంటి గొప్ప చిత్రాలెన్నింటికో స్క్రిప్టు రాశారు.

ఇలాంటిదే మరో ఫ్రెంచ్ సినిమా ‘నైస్ డి అల్లాహ్’. ఇది నైజీరియాలో ఇస్లాం మత వ్యాప్తి గురించి చర్చించింది. ఎలెన్ డి లాటర్ అనే దర్శకురాలు రూపొందించిన ఈ చిత్రం అల్లాహ్ దూత అయిన షేక్, ఇస్లాం ఆధ్యాత్మిక, ధార్మిక విశేషాలపై ఇచ్చిన వివరాలు ఉన్నాయి. నాస్తిక వాదులు ముస్లిం విధానాలను విమర్శించడం కూడా చిత్రంలో ఉంది. అంటే విషయాన్ని అన్ని కోణాల్నించి స్పృశించినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇస్లాం మతంపై వచ్చిన ఈ రెండు చిత్రాలూ మహిళా దర్శకులే రూపొందించడం విశేషం!
ప్రకాశ్ మెహతా అనే మరో దర్శకుడు బౌద్ధ మతంపై దృష్టి సారించి ‘జ్యువెల్ ఇన్ ద లోటస్’ రూపొందించాడు. మహాయాన బౌద్ధ మత ప్రకారం పద్మం, దాని రంగుల ప్రాముఖ్యతను విశ్లేషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ టిబెట్‌లోని బౌద్ధారామంలో జరిగింది. “బుద్ధిస్ట్ కల్చర్ అండ్ పాళీ” అనే మరో లఘు చిత్రం సుహాసిన్ ముఖర్జీ రూపొందించారు.

సత్యం, ప్రేమ, స్వేచ్ఛ, మానవత్వం, అహింస వంటి విషయాలపై గౌతమ బుద్ధుడిచ్చిన వివరణల్ని దృశ్యమయం చేశాడు. బుద్ధుడి రచనలు/ బోధనలు ఏవీ లిఖిత పూర్వకంగా లేవు. ఆయన తన శిష్య కోటికి బోధించినవే మౌఖిక ప్రచారాన్ని పొందాయి. బుద్ధుడు పాళీ భాషలో బోధ చేశాడు. అది మార్పులు చెంది ‘మగధి’ భాష అయ్యింది. ‘పాళీ’ అంటే పవిత్రమైన వాచకం అని అర్థం. ఇది ఇతర భారతీయ మాండలికాలపై గొప్ప ప్రభావాన్ని చూపిందని తర్వాత కాలంలో పరిశోధకులు తేల్చారు. ఇదే బౌద్ధ మతానికి సంబంధించి ‘ఓషన్ ఆఫ్ విజ్‌డమ్’ (జ్ఞాన సముద్రం) అనే మరో లఘు చిత్రం కూడా వచ్చింది. ఇది పద్నాలుగవ దలైలామా టిన్‌జిన్ సైమాట్యో జీవిత చిత్రణ. ఆరు మిలియన్ల టిబెట్ ప్రజలకు ఏకైక మత నాయకుడుగా ఆయన ఎంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నారన్నది ఈ చిత్రం చూపుతుంది. బౌద్ధానికి మూల పురుషుడైన బుద్ధుడు హిందువుల దశావతారాల్లో ఒకడు ఎట్లా అయ్యాడు అనేది ఎవరూ సినిమా తీసినట్టు లేదు.

పోనీ కూలంకషంగా చర్చించినట్టు లేదు. బౌద్ధుల కన్నా ముఖ్యంగా ఈ విషయమ్మీద హిందూ మత పెద్దలు మాట్లాడాలి. ‘ ఏ కొంచెం మంచి కనిపించినా మేం వారిని దేవుళ్లను చేస్తామని’ చెపుతారేమో. అలాగైతే జైనుడేం తక్కువ చేశాడు. జైనుణ్ణి మరో అవతారంగా కలుపుకోవాల్సింది. షిరిడి బాబా దాదాపు దేవుడై పూజలందుకుంటున్నాడు. పౌరోహిత్యం నెరిపే వారంతా బాబా గుళ్లలో ఇమిడిపోయారు. ఓ సినీ నటికి గుడి కట్టిన మూఢ జనం ఏమైనా చేయగలరు. అందుకే ప్రసిద్ధ శాస్త్రవేత్త అంటారు ‘విశ్వానికి అంతుందేమోగాని, మూఢత్వానికి లేదు’ అని! తెలుగు చలన చిత్రాలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే, జాతిని చైతన్యం చేయడానికి గూడవల్లి రామబ్రహ్మం కంకణం కట్టుకున్నారు. అంటరానితనం అడుగంటాలని, కుల వ్యవస్థను కూకటి వ్రేళతో పెళ్లగించి వేయాలని ఒక మహోన్నతమైన సంస్కరణ వాదంతో ‘మాలపల్లి’ చిత్రం రూపొందించారు.

బ్రాహ్మణాధిక్యత గల ఆనాటి సమాజంలో మాలల దుస్థితి ఎలుగెత్తి చెప్పడమే కాకుండా, ఇతర కులాల వారు వారిని పెండ్లాడి మనుషులుగా గుర్తించాలని కూడా ఆ చిత్రం సూచించింది. 1938లో వెలువడ్డ ‘మాలపిల్ల’ తమిళులను కూడా విశేషంగా ఆకర్షించింది. అవి భారత స్వాతంత్య్రం కోసం అహింసా పద్ధతిలో పోరాటం సాగుతున్న రోజులు. సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం నిత్య జీవితంలో భాగమైన రోజులు. ఆనాటి రోజుల్ని ఆనాటి సాంఘిక పరిస్థితుల్ని చిత్తశుద్ధితో, విప్లవ స్ఫూర్తితో చిత్రీకరించారు గూడవల్లి రామబ్రహ్మం. చిత్రం ఇతివృత్తం ఈ విధంగా ఉంటుంది. హరిజనుడొకడు గొడుగు వేసుకుని వెళ్లడం బ్రాహ్మణులకు నచ్చదు. బ్రాహ్మణ పెద్దలు పిలిచి దుర్భాషలాడి చెప్పుతో కొడతారు. హరిజనుల్లో సంచలనం బయలుదేరుతుంది. బ్రాహ్మణాధిక్యతను సహించలేక గుడి తలుపులు తోసుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తారు.

సనాతన వాది ఆలయ ధర్మకర్త మేడిచర్ల సుందర రామ శాస్త్రికి విషయం తెలుస్తుంది. “మాలలు దేవాలయం అపవిత్రం చేస్తుంటే.. చూస్తూ ఊర్కోవడమేనా? ఛీ.. ఛీ.. మీలో బ్రాహ్మణ రక్తం లేదూ” అని తన వాళ్లను దూషిస్తాడు. మరోవైపు దౌర్జన్య రహితంగా బ్రాహ్మణుల కళ్లు తెరిపించాలని గాంధేయ వాది అయిన చౌదరి హరిజనుల్ని సమాధాన పరుస్తుంటాడు. “పికిలిపిట్ట పేడ పురుగు ఒకటే అవుతుందా? సింహం చీమ ఒకటే అవుతాయా?” అని బ్రాహ్మణులు తమను తాము పొగడుకుంటారు. “పంచములు ఆది వాసులయ్యారని, వారే నేడు హరిజనులయ్యారని ఇంకా రేపు ఏమవుతారో” నని ధర్మకర్త రామశాస్త్రి హేళన చేస్తాడు. “కిన్నెరలు, కింపురుషులు బ్రాహ్మ రుషులూ అవుతారేమో” నని గేలి చేస్తాడు.

అవసరమైతే బ్రాహ్మణులు క్షాత్రం పూనగలరని హెచ్చరిస్తాడు. యుగయుగాలుగా తమదై ఉన్న ఈ తాత్విక సంపదను ధార్మిక ఆచారాల్ని పరులకు ఎంత మాత్రమూ అందించబోమని ఖరాఖండిగా చెప్తాడు. అంతే కాదు చెరువు నీరు హరిజనుల గూడానికి పోకుండా కట్టుదిట్టం చేస్తాడు. “బాపనోడికి సుకంగా తిని కూసునే కర్మ, మాలోడికి బువ్వలేక, నీరు లేక మలమలమాడే కర్మ ఈ భూమ్మీద ఇదేం న్యాయం” అని హరిజనులు దేవుడి మీద కూడా తిరుగుబాటు చేస్తారు”. సుకంగా గుళ్లో కూసోని ప్రసాదాలు తిన మరిగిన దేవుడు కూడా, బ్రాహ్మల పక్షమే” సని తీర్మానించుకుంటారు. మాలపల్లి చలన చిత్రం వెలువడి సుమారు ఎనభై యేళ్లవుతున్నా మన సమాజంలో మాత్రం మార్పు రావల్సినంత రాలేదు. కుల, మత, ప్రాంతీయ భేదాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి.

ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన కన్నడ సినిమా ‘ఘటశ్రాద్ద’. ఇది దర్శకుడు గిరీష్ కాసరవల్లి తొలి చిత్రం. దీని ఇతివృత్తమేమిటంటే నీతి తప్పి “పాపాత్ము” రాలైన బ్రాహ్మణ విధవరాలికి కుటుంబంతో అన్ని సంబంధాలను తెగ తెంపులు చేయడం ‘ఘటశ్రాద్ద’ ముఖ్యోద్దేశం! మనిషి చనిపోయినప్పుడు చేసే వైదిక కర్మలతో ఇది సమానం. కాని భేదం ఏమిటంటే ‘పాప పంకిలమైన’ ఆత్మ ఇక్కడ సజీవంగా ఉంటుంది. అంటే విధవరాలు బతికి ఉండగానే ఆమెకు శ్రాద్దం పెడతారన్నమాట. ఆమెకు కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి. ఆస్తిపాస్తుల మీద హక్కు పోతుంది. బ్రాహ్మణ అగ్రహారం నుండి బహిష్కరింపబడుతుంది. ఆచార కర్మలలో ఒక మట్టి పాత్రను పగలగొడతారు. ఇక్కడ మట్టి పాత్ర ఆ స్త్రీ గర్భానికి సంకేతం! అంటే సంతానోత్పత్తి అర్హతను పగలగొట్టడ మన్నమాట!! బాల్య వివాహాల వల్ల, యవ్వన దశలోనే విధవరాలైన యువతిని జీవచ్ఛవంగా తయారు చేస్తారు. ఆమె బతికి ఉండగానే తద్దినం పెట్టే నీచమైన ఆచారం ఇది. ఎందరో సంఘ సంస్కర్తలు, మరెందరో హేతువాదులు పూనుకుని మార్పు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటే, సమాజం ఈ దశకైనా వచ్చింది. అయితే రావల్సిన మార్పు ఇంకా చాలా ఉంది.

ఈ విధంగా వివిధ మతాల గూర్చి, మత దురాచారాల గూర్చి వచ్చిన చలన చిత్రాలెన్నో ఉన్నాయి. వాటి గూర్చి ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే బాబామజ్ గాంకర్ రూపొందించిన “వుయ్‌” (మేం) అనే చిత్రం మతాలన్నీ జాతీయ సమైక్యతకు పాటుపడాలని ఉద్బోధిస్తుంది. అలాగే రాజేంద్ర జగ్లే రూపొందించిన ‘మండూ’ సినిమా గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది మధ్యప్రదేశ్‌లోని ‘మండూ’ అనే స్థలంగొప్పదనాన్ని తెలియజేస్తుంది. హిందూ ముస్లింల కలిమికి, చెలిమికి ప్రతీకగా నిలిచే స్థలం అది. బాబ్ బహదూర్ చక్రవర్తికి, రూపమతి అనే గొర్రెలు కాచే యువతికి మధ్య ప్రణయానికి పరిణయానికి గుర్తు ఆ స్థలం!! ఈ కథ మన హైదరాబాద్ యువరాజు భాగ్య (భాగమతి)ల ప్రణయ గాథను పోలి ఉంటుంది. రచయితలు ఏ కథైనా రాసుకోవచ్చు.

సినీ దర్శకులు ఏ సినిమానైనా తీసుకోవచ్చు. మూఢ నమ్మకాల్ని పెంచే దిశలో అభూత కల్పనల్ని మాత్రం ప్రచారం చెయ్యొద్దు. కాలం మారింది. యువత ప్రతిదానికీ కారణం వెతుకుతున్నారు. స్వర్గాల, నరకాల, పునర్జన్మల కాలం చెల్లింది. ఏదైనా ఇక వాస్తవాల పునాదుల మీద రావల్సి ఉంది. ఒక తాజా ఉదాహరణ చెప్తాను. మయన్మార్‌లో ఒక మిలియనీర్ అస్వస్థుడయ్యాడు. ‘లాభం లేదు ఎక్కువ కాలం బతకడు’ అని డాక్టర్లు చెప్పారు. అతను కూడా తనకు తాను గ్రహించుకున్నాడు. దానితో పాటు తన దగ్గరున్న మిలియన్ల డబ్బు చనిపోయాక తనతో రాదు అని వాస్తవం తెలుసుకున్నాడు. ప్రతి రోజూ కొంత కొంత డబ్బు పేదలకు పంచడం ప్రారంభించాడు.

                                                                                                           – డాక్టర్ దేవరాజు మహారాజు
Excellent Movies on Religions