Home చిన్న సినిమాలు ఉర్రూతలూగిస్తున్న ‘ఛోరా చకోరా’

ఉర్రూతలూగిస్తున్న ‘ఛోరా చకోరా’

Excellent response to Chora Chakora song

 

అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా ‘శుక్ర’. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. రుజల ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘ఛోరా చకోరా’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మాస్ నెంబర్‌లో చాందినీ భతిజ చేసిన డాన్సులు, ఎక్స్‌ప్రెషన్స్ యూత్‌ను ఎంతగానో అలరిస్తున్నాయి. మైండ్ గేమ్స్ నేపథ్యంలో ‘శుక్ర’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర ఎంటర్‌టైన్‌మ్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.