మనతెలంగాణ/కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూరు మండ లం జంగంపల్లి గ్రామంలో గురువారం ఉదయం 54 కి లోల క్లోరోహైడ్రెట్‌ను పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరిండెం ట్లు డేవిడ్వ్రికాంత్, శ్రీనివాస్‌లు తెలిపారు. జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిజామా బాద్‌మావేశంలో వారు మాట్లాడుతూ జంగంపల్లి గ్రామం లో కల్తీకల్లు జోరుగా విక్రయిస్తున్నట్లు సమాచా రాగా గ్రామంపై నిఘా ఉంచామని గురువారం పక్కా సమాచారంతో జంగంపల్లి గ్రామానికి చెందిన మహేష్‌గౌడ్ తన బైక్‌పై రెండు కిలోల క్లోరల్ హైడ్రెట్‌ను కల్లు దు కాణంలోకి తీసుకెళ్తుండగా అతన్ని అరెస్టు చేసి అతని ఇంట్లో సోదాలు చేయగా 52కిలోల క్లోరోహైడ్రేట్ లభించిందన్నా రు. ఇందులో మొత్తం 9మంది ఉండగా ముగ్గురిని అరెస్టు చేశామని ఆరుగురు పరారిలో ఉన్నట్లు వారు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో సిద్దాగౌడ్, కందునూరి నరేష్‌గౌడ్, మీసాల ప్రవీణ్‌గౌడ్, ఆర్. ప్రసాద్‌గౌడ్, రమేష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతిగౌడ్, రమేష్‌గౌడ్‌లు ఉన్నారు. దాడి చేసి పట్టుకున్న వారిలో కామారెడ్డి సూపరిండెంట్ శ్రీనివా స్, డిటిఎఫ్ సిఐ సాయన్న, కామారెడ్డి సిఐ రవీంధర్‌రెడ్డి, సిబ్బంది విష్ణు, అమృత్‌రెడ్డి, లావణ్య, నవీన్ పాల్గొన్నారు.
54 కిలోల క్లోరల్ హైడ్రెట్ పట్టుకున్న ఎక్సైజ్‌శాఖ
- Advertisement -
- Advertisement -