Saturday, April 20, 2024

13 బిలియన్ డాలర్ల అప్పుదిశగా కేంద్రం!

- Advertisement -
- Advertisement -

పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు భారాన్ని దించుకునే దిశగా అడుగులు

Excise duty decreased on petrol and diesel

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపధ్యంలో కేంద్రం భారీగా ఆదాయాన్ని కోల్పోనుంది. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రుణ మార్గాలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం ప్రకటించిన నిర్ణయం తాలూకు పరిణామాల కారణంగా దాదాపు 13 బిలియన్ డాలర్ల్ల ఆదాయాన్ని కేంద్రం కోల్పోతుందని అంచనా. దాన్ని పూడ్చుకునేందుకు అంతే మొత్తంలో అదనంగా అప్పు చేయాలని తలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పలు వివరాలను వెల్లడించింది. దీనిపై వివరణ కోరేందుకు ఆర్థిక శాఖ అధికార ప్రతినిధికి ఫోన్ చేస్తే స్పందించలేదని ఆ వర్గాలు తెలిపాయి.

వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా వసూలైన సొమ్ము పేదలు, రైతులకు ఆహారం, ఎరువుల కోసం రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇటీవల తగ్గించిన ఎక్సైజ్ సుంకాల వల్ల ఖజానాకు రాబోతున్న నష్టాన్ని అదనపు రుణాల ద్వారా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణ భారం పెరుగుతుండటంతో భారత దేశ బాండ్ మార్కెట్‌పై ప్రభావం పడుతుంది.

గత నెలలో బెంచ్‌మార్క్ 10 ఏళ్ల నోట్స్‌పై రాబడిలో పెరుగుదల కనిపించింది. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నెలలో వడ్డీ రేట్లను పెంచి మదుపరులను ఆశ్చర్యపరిచింది. కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోలు, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించడంతోపాటు, కోకింగ్ కోల్‌పై దిగుమతి పన్నును తగ్గించింది. అదేవిధంగా ఎరువులపై రాయితీలను పెంచింది. అంతేకాకుండా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద పేదలకు అందిస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధరలో రాయితీని పెంచింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తేవాలని ప్రణాళికను రచిస్తుండటాన్ని, ధరల ఒత్తిళ్ళు పెరుగుతుండటాన్ని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదలను మదుపరులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News