Home ఖమ్మం నగరంలో 10 కిలోల గంజాయి పట్టివేత

నగరంలో 10 కిలోల గంజాయి పట్టివేత

Marijuana Seized

 

ఖమ్మం: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా గల షాదీఖానా సమీపంలో గురువారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 10 కిలోల ఎండు గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుమలాయపాలెం మండలం కుక్కల తండాకు చెందిన బానోత్ రవి, బానోత్ దుగ్లా విశాఖపట్నం జిల్లా పాడేరు నుండి ఎండు గంజాయిని వారి గ్రామానికి తరిలించి చాలా వరకు మరిపెడ బంగ్లాలో విక్రయించగా, మిగిలిన దానిని ఖమ్మం పట్టణంలో అమ్మటం కోసం తీసుకు వెళ్తుండగా అదే క్రమంతో ఖమ్మం డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జి. అంజన్‌రావు ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఐదు ప్యాకెట్లతో మోటర్ సైకిల్‌పై వెళ్తుండగా గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు గత కొంత కాలంగా మరిపెడతో పాటుగా ఖమ్మం రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఇట్టి దందాను కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో రూ. 50వేలు ఉంటుందాని వన్‌టౌన్ ఎక్సైజ్ సిఐ కె. రాజు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ వై. సర్వేశ్వర్‌రావు, ఎస్ఐలు ఆర్. రాజిరెడ్డి, బి. రవి, సిబ్బంది రామారావు, సలీం,  కవిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Excise Police seized 10 kg of marijuana in Khammam