Home బిజినెస్ రూ.7,961 కోట్ల అప్రకటిత ఆదాయం బహిర్గతం

రూ.7,961 కోట్ల అప్రకటిత ఆదాయం బహిర్గతం

incm

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్(నోట్ల రద్దు) తర్వాత రూ.7,961 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని ఆదాయం పన్ను శాఖ గుర్తించింది. ఈమేరకు సోమవారం పార్లమెంట్‌కు ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ఐటీ అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 900 మంది సంస్థలు, వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్ లోక్‌సభకు తెలిపారు. ఈ దాడుల్లో రూ. 900కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే రూ.7,961 కోట్ల అప్రకటిత ఆదాయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. 2017 నవంబర్ 30 నాటికి రూ.18.70 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 2016 సంవత్సరం ఇదే సమయంలో రూ.15.70 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నల్లధనం, అవినీతిని నిర్మూలించేందుకు గాను పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.