Friday, April 19, 2024

తెలంగాణలో ప్రగతి‘బాటలు’

- Advertisement -
- Advertisement -

Expansion of National Highways in Telangana

వాగులు, నదులపై అవసరమైన వంతెనలు
7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ. 11,257 కోట్ల విడుదల
పూర్తయిన 5,453 కిలోమీటర్ల రోడ్లు

హైదరాబాద్ : రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ, పంచాయతీరాజ్ -ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రచించి, అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రహదారుల పరిస్థితిని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణలో ప్రగతిబాటలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని 7,554 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ. 11,257 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పూర్తి కాగా, వీటికోసం రూ.7,463 కోట్లను, దీంతోపాటు రోడ్లు మరమ్మతుకు రూ.1,868 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

వీటితోపాటు మంజీర, గోదావరి, మానేరు, ప్రాణహిత, మున్నేరు, అకేరు, మూసీ, తుంగభద్ర తదితర నదులపై ప్రభుత్వం వంతెనలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీవంతెనల నిర్మాణాలను చేపట్టి ఇప్పటికే 16 నిర్మాణాలను పూర్తిచేసింది. 2018-, 19లో బడ్జెట్లో రూ. 5,575 కోట్లు, 2019, -20లో రూ.2,219 కోట్లు, 2020, -21 లో రూ.3493.67 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ బడ్జెట్‌లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సిసి రోడ్లకు మరో రూ.600 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బిటి రోడ్డు లేదు. రూ.2,518 కోట్ల వ్యయం చేసి, మండల కేంద్రాలకున్న 1,875 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను ప్రభుత్వం డబుల్ లేన్ రోడ్లుగా మార్చింది.

గణనీయంగా జాతీయ రహదారుల విస్తరణ

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి తెలంగాణలో కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. 2014 జూన్ 2 నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుంటే, రాష్ట్రం సగటు కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రం మంజూరు చేయించుకుంది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగున్నర ఏళ్లలో అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. వీటితోపాటు రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల వ్యయంతో మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఆర్ & బి రహదారుల నిర్మాణం

రాష్ట్రంలో ఆర్ అండ్ బి పరిధిలో 24,495 కిలోమీటర్ల రహదారులుండగా, 2,552 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలు, 11,967 కిలోమీటర్ల జిల్లా రహదారులు, 10,335 కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం రహదారుల్లో 16,864 కిలోమీటర్ల రహదారులు, అంటే 70 శాతం రోడ్లు సింగిల్ లేన్ రోడ్లుగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని గ్రహించిన తెలంగాణ ప్రభు త్వం సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రూ.7,029 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఆర్ అండ్ బి పరిధిలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టింది. 16,864 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా, 9,731 కిలోమీటర్ల రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో 511 వంతెనల నిర్మాణం చేపట్టగా, 259 వంతెనల నిర్మాణం పూర్తయ్యింది.

పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం

రాష్ట్రంలో 67,714 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులున్నాయి. ఇందులో 31,144 కిలోమీటర్ల రహదారులు మట్టి, మొరం రోడ్లు కాగా, 13,103 కిలో మీటర్లు కంకర రోడ్లు. మిగతా 23,467 కిలోమీటర్లు బిటి రోడ్లు. 2014 నుంచి జనవరి 2019 నాటికి పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 9,807 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 10 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లను బిటి రోడ్లుగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా జనవరి 2019 నాటికి 8,042 కిలోమీటర్ల పని పూర్తయ్యింది.

15,958 కిలోమీటర్ల మేర బిటి రోడ్లకు మరమ్మతులు చేపట్టగా, 14,583 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. 511 వంతెనల నిర్మాణం చేపట్టగా జనవరి 2019 నాటికి 312 వంతెనలు పూర్తయ్యాయి. 199 వంతెనల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ వంతెనల వద్ద నీటి నిల్వలకు వీలుగా 312 చెక్‌డ్యాంలను నిర్మించగా, మరో 1,235 చెక్ డ్యాంలను నిర్మించాల్సి ఉంది. 346 బ్రిడ్జిల పని పూర్తవ్వగా మిగిలిన రోడ్లు, వంతెనల నిర్మాణాలను పూర్తిచేస్తోంది. రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలకు కచ్చితంగా బిటి రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-, 21 బడ్జెట్లో గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది.

నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మారుమూల గ్రామాల నుంచి పట్టణాల్లో ఉన్న రోడ్ల అభివృద్ధికి సిఎం కెసిఆర్ అధిక నిధులను కేటాయిస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం భవనాలు నిర్మిస్తోంది. ఒక్కో భవనానికి కోటి రూపాయల వ్యయంతో 500 గజాల విస్తీర్ణంలో 104 క్యాంపు కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. వాగులు, నదుల మీద అవసరమైనన్నీ వంతెనలను నిర్మిస్తూ రాకపోకలను పునరుద్ధరిస్తున్నాం.

రికార్డుస్థాయిలో వంతెనల నిర్మాణం

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లున్నప్పటికీ వాగులు, నదుల మీద అవసరమైనన్నీ వంతెనల లేకపోవడం వల్ల వర్షాకాలంలో రా కపోకలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బి పరిధిలో 511, పంచాయతీరాజ్ పరిధిలో 631 వంతెనల నిర్మా ణం చేపట్టింది. కొత్తగా ఆర్‌ఓబీలను నిర్మించింది. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా నుంచి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వరకు విస్తరించిన అటవీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా గోదావరి, ప్రాణహిత నదుల వెంట మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడానికి ప్ర భుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకుంది. రూ.546.96 కో ట్ల వ్యయంతో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వరకు దాదాపు 350 కి.మీ. మేర కొత్త రహదారిని నిర్మిస్తోంది.

Expansion of National Highways in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News