Home రాష్ట్ర వార్తలు శాఖల సరళీకరణ

శాఖల సరళీకరణ

ఆయా రంగాల ప్రాధాన్యం అవసరాన్ని బట్టి జిల్లాల్లో విభాగాల విస్తరణ, కుదింపు
పనిభారమే ప్రాతిపదిక కావాలి సమన్వయ లోపం లేకుండా చూడాలి: సిఎం

kcrహైదరాబాద్: అతిగొప్ప పాలనా సంస్కరణగా పరిగణింపబడే జిల్లాల పునర్వవస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్షంగా పరిపాలనా విభాగాలు ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒకే విధమైన పరిపాలనా విభాగం, ఉద్యోగుల సంఖ్య ఉండా లనే కచ్చితమైన నిబంధన ఏదీ లేదని ముఖ్య మంత్రి చెప్పారు. ఆ జిల్లాల్లోని స్వభావం, స్వ రూపం, పనితీరు, అవసరాన్ని బట్టి విభాగాల విస్తరణ, కుదింపు,  సర్దుబాటు ఉండాలని కెసిఆర్ అన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగు పర్చడం, సమర్ధ పర్యవేక్షణ, సంపూర్ణ పర్యవే క్షణ, పారదర్శక పాలన, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సత్వర అమలు లక్షా లుగా వివిధ జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పునర్వవస్థీకరణ జరగాలన్నారు. ఒకే స్వభావం కలిగిన పనులు చేసే అధికారులు వేర్వేరు విభాగాల కింద ఉన్నారని, దీనివల్ల సమన్వయం లోపిస్తుందని, అంతిమంగా కార్యక్రమాల అమలుకు విఘాతం కలుగుతుందని సిఎం చెప్పారు. ఈ గందర గోళాన్ని నివారించడానికి ప్రభుత్వ శాఖల్లో సరళీకరణ జరగాలని సిఎం చెప్పారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్ తదితర శాఖలకు ప్రతి జిల్లాలో పని ఉంటుందని, కానీ అటవీ శాఖ, మునిసిపల్, మైనార్టీ, గిరిజన సంక్షేమం, ఉద్యా నవన, పరిశ్రమలు తదితర శాఖల్లో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా పనిభారం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో ఉండాల్సిన పరిపాలనా విభాగాల కూర్పుపై నగరంలోని ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డిలో గురువారం సిఎం సమీక్ష జరిపారు. హైదరాబాద్ చుట్టు పక్కల పరిశ్రమల శాఖకు పని ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ శాఖ విస్తరిం చాలి. గ్రామీణ జిల్లాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖలు బాగుపడాలి. అడవులు ఎక్కువ ఉన్న భూపాల పల్లి, కొత్తగూడెం, మంచిర్యాల లాంటి జిల్లాల్లో ఆ శాఖ కార్యకలాపాలు ఎక్కువ చేయాలి. ఉద్యాన వనాలు ఎక్కువ ఉండేచోట హర్టికల్చర్ శాఖ మెరుగ వ్వాలి. అవస రమైతే ఆ శాఖల్లో కొత్త ఉద్యోగాలు సృష్టిం చాలి. గిరిజ నులు లేని జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారి అవస రమా? అడవులు లేని చోట అటవీ శాఖా ధికారి అవసర మా? అవసరాన్ని బట్టి ప్రభుత్వ విభాగా లు వుండాలి అని సిఎం సూచించారు. ‘ఒకే స్వభావం కలిగిన పనులు చే యడానికి వేర్వేరు అధికారులు ఉన్నారు. దీనివల్ల గంద రగోళం, సమన్వయలోపం ఏర్పడుతోంది. కాబట్టి శాఖల పునరేకీకరణ జరగాలి. ఎస్‌ఎస్‌ఎ, ఆర్‌ఎస్‌ఎ పాఠశాల విద్య వంటి విభాగాలను పర్యవేక్షించే బాధ్యత జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలోకి తేవాలి. కుటుంబ సంక్షే మం, కుష్టు, ఎయిడ్స్, ఇమ్యునై జేషన్, శిక్షణ, మలేరియా తదితర విభాగాలన్నింటిని జిల్లా వైద్యాధికారికి అప్పచెప్పాలి. అభయారణ్యాలు, అటవీ, సామాజిక వన విభాగాలు ఒకే అధికారి పర్య వేక్షణ కింద వుండాలి. చిన్న, మధ్య తరహా నీటిపారుదల విభాగాలకు ఒకే అధి కారి ఉండాలి’ అని సిఎం చెప్పారు. ప్రత్యేక లక్షం సాధించడంకోసం ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడు తుంది. ఆ పని పూర్తయిన తరు వాత కొనసాగించవద్దు. వారిని పనిభారం ఉన్నచోట వాడుకోవాలి. సర్వేశాఖ లాంటి కొన్ని శాఖల ప్రాధాన్యం ఉన్నందున అవి మరింత విస్తరించాలి. రెవిన్యూ శాఖ బాగా మారాలి, సిటిజన్ చార్టర్ అమలు చేయాలి’ అని చెప్పారు. ‘ముఖ్య ప్రణాళిక అధికారి ప్రాధాన్యం విస్తరిం చాలి. మంత్రులు టి.హరీశ్ రావు, జి.జగదీష్ రెడ్డి, ఎం పి వినోద్ కుమార్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వి.ప్రశాం త్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.