Friday, April 19, 2024

టెట్ శాశ్వత వ్యాలిడిటీ నిర్ణయం కోసం పాత అభ్యర్థుల ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

Expectations of older candidates for TET permanent validity decision

 

ఇప్పటికే ముగిసిన వ్యాలిడిటీ ముగిసిన వారిపై లేని స్పష్టత

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీపై నిర్ణయం కోసం ప్రైవేట్ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు టెట్ వాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉండగా, దానిని శాశ్వతం చేయాలని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) పాలక మండలి నిర్ణయించింది. అయితే ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఎన్‌సిటిఇ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పలుమార్లు టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎన్‌సిటిఇ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలలో టెట్ స్కోర్‌కు వెయిటేజి ఉండటంతో టెట్ వాలిడిటీ, టెట్ స్కోర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత టెట్ వాలిడిటీపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ముగిసిన 2011, 2012 టెట్ల వాలిడిటీ

టెట్‌ను 2010లో అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 సార్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు టెట్ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్-1లో 1,35,105 మంది, పేపర్-2లో 1,66,262 మంది అర్హత సాధించారు. రెండవ టెట్‌లో పేపర్-1లో 24,578 మంది, పేపర్-2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడవ టెట్‌లో పేపర్-1లో 26,382 మంది, పేపర్-2లో 1,94,849 మంది అర్హత సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తమ ఏడేళ్ల వ్యాలిడిటీ దాదాపుగా ముగిసిపోయింది. 2011లో నిర్వహించిన మొదటి టెట్ వ్యాలిడిటీ రెండేళ్ల క్రితమే ముగిసిపోగా, 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ గత ఏడాదే ముగిసిపోయింది.

ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న వారితోపాటు ఇప్పటికే వ్యాలిడిటీ ముగిసిన అభ్యర్థుల విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ విషయంలో ఎన్‌సిటిఇ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2011, 2012 సంవత్సరాలలో నిర్వహించిన టెట్‌కు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినందున తెలంగాణ విద్యార్థులు కనీసంగా 6 లక్షల వరకు ఉంటారు. వారిలో తమ టెట్ 7 ఏళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు కనీసంగా 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉన్నందున పలువురు తమ స్కోర్‌ను పెంచుకునేందుకు పలుమార్లు టెట్‌కు హాజరయ్యారు.అందులో కొందరికి మాత్రమే స్కోర్ పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News