Friday, March 29, 2024

ఏలూరు వింత వ్యాధిపై నిపుణుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి
 మంత్రి ఆళ్ల నానితో సమీక్ష
 కల్తీ పాల వల్లగాని, పురుగు మందుల వల్లగాని వ్యాధి సోకి ఉండొచ్చని అనుమానం

మన తెలంగాణ/హైదరాబాద్: ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్ ఓ అంచనాకు వస్తోంది. పాలకల్తీ వల్లకానీ, పురుగు మందుల కారణంగా గాని ఈ వ్యాధి ప్రబలినట్లు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 556 కేసులు నమోదు కాగా, వారిలో 458 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈక్రమంలో 68మంది కొత్త బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న నలుగురు బాధితుల నుంచి సేకరించిన బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను ఎయిమ్స్ నిపుణులు పరీక్షిస్తున్నారు. బాధితులకు సంబంధించి కొన్ని శాంపిల్స్‌ను ఢిల్లీకి పంపగా, ఇంకొన్ని శాంపిల్స్‌ను మంగళగిరి ఎయిమ్స్‌లో పరీక్షిస్తున్నారు. మోతాదులో లెడ్, నికెల్ అవశేషాలు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.పరిస్థితి తీవ్రంగా మారడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న డబ్ల్యుహెచ్‌వొ ప్రతినిధి డాక్టర్ భవాని వింత వ్యాధి వ్యాప్తిపై మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేసుల వివరాలు, పేషేంట్స్ లక్షణాలు, రిపోర్ట్ ఫలితాలపై సమీక్షలో చర్చించారు. పాలు, నీళ్ల పరీక్షల్లో సాధారణ ఫలితాలు రావడంతో కూరగాయలపై దృష్టిపెట్టాలని వాటిని పురుగుమందు పరీక్షలకు పంపాలని ఆదేశించారు. ఏలూరు ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్‌ను ఏర్పాటు చేయాలని, పట్టణంలో ఫాగింగ్ చేయాలన్నారు. వ్యాధి లక్షణాలతో వచ్చి చేరుతున్న వారిసంఖ్య గంటగంటకు పెరుగుతుండడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు నిండిపోయాయి.

దీంతో ఆశ్రమ హాస్పిటల్‌లో వంద బెడ్లు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి శాంపిల్స్ పుణె, ఢిల్లీ ల్యాబ్‌లకు పంపారు. మరోవైపు అసలు ఇక్కడ ఏం జరిగింది? అన్న విషయాన్ని తేల్చేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ఆఫ్ న్యూట్రీషియన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నుంచి ఇద్దరు శాస్త్రవేత్తలు వైద్య సిబ్బందితో చర్చించారు. ఇదిలావుండగా ప్రజారోగ్య సిబ్బంది, విభాగాలు నిశిత పరిశీలన చేయాలని, అస్వస్థతకు దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. బాధితులకు కొనసాగుతున్న వైద్య చికిత్స, వారికి అందుతున్న సదుపాయాలపై కూడా సిఎం అధికారులతో సమీక్షించారు. గత కొద్ది రోజులుగా పరిసరాల్లో ప్రజలు అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి గాను దేశంలోని అనేక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలు చేరుకున్నాయని డిసిహెచ్‌ఎస్ ఎవిఆర్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా డిసిహెచ్‌ఎస్ ఎవిఆర్ మోహన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య తగ్గడమే కాక డిశ్చార్జిల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి బృందాలు వచ్చి నమోదు అయిన కేసుల వివరాలు తెలుసుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. అంతేకాక నుంచి ఇద్దరు ప్రతినిధులు వచ్చారని తెలిపారు. ఇక్కడ నుంచి వాటర్, మిల్క్ శాంపిల్స్ సేకరించి న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు పంపుతామన్నారు. పూణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి నిపుణులు వస్తారని తెలిపారు మోహన్. ప్రస్తుతం ఇక్కడ బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. డిశ్చార్జి అయిన వారిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్ని ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక వచ్చిందని కొత్తగా మరో 40 మంది బాధితుల శాంపిల్స్ సేకరించి పంపిచామన్నారు. పూర్తిగా నిర్దారణ లేకుండా నివేదికలు బయటకు వెల్లడించలేమన్నారు. భయాందోళనవల్ల కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు మోహన్.
వైద్య సేవలపై సిఎం ఆరా..!
ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై సిఎం వైయస్ జగన్ ఆరా తీశారు. ఇప్పటివరకూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అస్వస్థతకు గురైనవారికి ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందని మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఐఐసిటి కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు కూడా త్వరగా వస్తాయని వెల్లడించారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి తనకు ఇవ్వాలని, దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌కూడా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాలు ఎలా ఆ ప్రాంత ప్రజల శరీరాల్లోకి చేరాయో, దానికి తగ్గ కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని సిఎం అధికారులను ఆదేశించారు.
మంత్రితో డబ్ల్యుహెచ్‌వొ ప్రతినిధి సమీక్ష
పరిస్థితి తీవ్రంగా మారడంతో.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ భవాని… వింత వ్యాధి వ్యాప్తిపై మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేసుల వివరాలు, పేషేంట్స్ లక్షణాలు, రిపోరట్స్ ఫలితాలపై సమీక్షలో చర్చించారు. పాలు, నీళ్ల పరీక్షల్లో సాధారణ ఫలితాలు రావడంతో కూరగాయలపై దృష్టిపెట్టాలని… వాటిని పురుగుమందు పరీక్షలకు పంపాలని ఆదేశించారు. ఏలూరు ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్‌ను ఏర్పాటు చేయాలని, పట్టణంలో ఫాగింగ్ చేయాలన్నారు. వ్యాధి లక్షణాలతో వచ్చి చేరుతున్న వారిసంఖ్య గంటగంటకు పెరుగుతుండడంతో… ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు నిండిపోయాయి. దీంతో ఆశ్రమహాస్పిటల్‌లో వంద బెడ్లు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి శాంపిల్స్.. పుణె, ఢిల్లీ ల్యాబ్‌లకు పంపారు. మరోవైపు అసలు ఇక్కడ ఏం జరిగింది?అన్న విషయాన్ని తేల్చేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ఆఫ్ న్యూట్రీషియన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నుంచి వచ్చిన ఇద్దరు శాస్త్రవేత్తలు స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు.
రక్తనమూనాల్లో లెడ్, నికెల్ అవశేషాలు
ఏలూరులో రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో లెడ్, నికెల్ అవశేషాలులను ప్రాథమికంగా గుర్తించినట్లు.. మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా.రాకేష్ కక్కర్ తెలిపారు. సీసం, నికెల్ లోహాల కారణంగానే స్పృహ కోల్పోవడం, మూర్ఛ లక్షణాలు వచ్చాయని వివరించారు. నీటి కాలుష్యమే కారణమై ఉంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఎక్కడినుంచి ఈ భార లోహాలు వచ్చాయో తెలుసుకునేందుకు దిల్లీ ఎయిమ్స్ నుంచి మరో బృందం ఏలూరు వెళ్లిందని తెలిపారు. నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు డా. రాకేష్ కక్కర్ వివరించారు.
రోగుల వివరాల నమోదు
హైకోర్టు ఆదేశాల మేరకు రోగుల నుంచి పశ్చిమగోదావరి జిల్లా జడ్జి భీమారావు వివరాలు నమోదు చేశారు. ఆసుపత్రిలో చేరిన బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిట్స్‌తో ఎక్కువమంది ఆస్పత్రిలో చేరారని ఆయన తెలిపారు. లెడ్, నికెల్ కారకాలున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధులు ద్వారా తెలిసిందని వివరించారు. ఇంకా, పూర్తి నివేదిక రావాల్సి ఉందని.. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎయిమ్స్ రిపోర్ట్ వచ్చాక అన్ని కారణాలను విశ్లేషించి హైకోర్టుకు నివేదిక ఇస్తామని భీమారావు స్పష్టం చేశారు.

Expert Scramble of Eluru Mysterious Disease

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News