Home తాజా వార్తలు సముద్రంలో అపురూప ఖనిజాల అన్వేషణ

సముద్రంలో అపురూప ఖనిజాల అన్వేషణ

ocean

స్మార్ట్‌ఫోన్ల తయారీకి కావలసిన అత్యంత విలువైన ఖనిజాల అన్వేషణకు సముద్ర గర్భం అడుగున 2500 మీటర్ల (8000 అడుగుల ) లోతైన నేలపైకి రోబోలను శాస్త్రవేత్తలు పంపిస్తున్నారు. నార్వే లోని యూనివర్శిటీ ఆఫ్ బెర్బెన్ శాస్త్రవేత్తలు నార్వే, గ్రీన్‌ల్యాండ్, మధ్య సముద్ర జలాల్లో ఈ అన్వేషణ చేపట్టారు. సముద్రం అడుగున చీకటి కోణంలో విస్తరించిన విశాలమైన నేల లోతుల్లో జింక్, బంగారం, రాగి ఖనిజ నిక్షేపాలను కనుగొనడానికి అంతర్జాతీయ పరిశోధకుల బృందం స్వయంగా వ్యవహరించే రోబోలతోపాటు మానవ పైలట్లతో నడిచే సబ్‌మెరైన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది.

కొన్నిచోట్ల అపారమైన ఖనిజాలు ఉండగా, మరికొన్ని చోట్ల అసలు ఖనిజాల జాడే లేకపోవడానికి కారణాలు ఏమిటో ఈ పరిశోధనల వల్ల తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన 17 మూలకాల సముదాయం స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లకు, అయస్కాంతాలకు, కెమెరా లెన్స్‌లకు, ఎక్స్‌రే మెషిన్లకు, ఉపయోగపడడం ఎంతో లాభదాయకం. కానీ వీటిని సాధించడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని సముద్ర జలాల్లో బంగారం, రాగి, జింక్, ఇతర అపురూప ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మరికొన్ని సముద్ర జలాల్లో ఇవేవీ ఉండవు. అందువల్ల శాస్త్రవేత్తలు దీన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.

Exploration of rare minerals in the ocean