Home జాతీయ వార్తలు పటాకుల కర్మాగారంలో పేలుడు : కార్మికుడు మృతి

పటాకుల కర్మాగారంలో పేలుడు : కార్మికుడు మృతి

Explosion at fireworks factory: Worker killedచెన్నయ్  : తమిళనాడులోని శివకాశి శివారులోని జమీన్‌సల్వార్‌పట్టి పటాకుల కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ పేలుడు ఘటనలో ఓ కార్మికుడు చనిపోయాడు. విరుదునగర్‌ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో భారీ సంఖ్యలో బాణాసంచ కర్మాగారాలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు ప్రకటించిన నెల తర్వాత ఈ కర్మాగారాల్లో పటాకులను తయారీ చేస్తున్నారు. శనివారం ఓ కర్మాగారంలో మిక్సింగ్‌ ఛాంబర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడుకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.